వినమరుగైన

ఫిడేలు రాగాల డజన్ -పఠాభి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వాన్ని ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
మొదటిది ప్రభావ కవిత్వం
రెండవది ప్రసార కవిత్వం
మూడవది ప్రయోగ కవిత్వం
జాతికి అవసరమైనపుడు నిర్మాణాత్మకమైన గొప్ప భావాలతో ముందుచూపుతో కొత్తదారిని చూపించగలిగేది ప్రభావ కవిత్వం. గురజాడ, శ్రీశ్రీ మొదలైన కవులు ప్రభావ కవులు. మరో మాటలో చెప్పాలంటే సాహిత్య చరిత్రలోని యుగకర్తలు ప్రభావ కవులన్నమాట.
ఇక ప్రసారకవిత్వం అంటే ఏమిటో చూద్దాం. ప్రభావ కవిత్వం చూపిన దారిలో పయనిస్తూ ప్రజల్ని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగే కవిత్వం ప్రసార కవిత్వం. దాశరధి, నారాయణరెడ్డి మొదలైన కవులు ప్రసారకవులు.
ఇక ప్రయోగ కవిత్వం మూడోది. భాషలో, ప్రక్రియలో, భావనలో కొత్తదనం కోరుకొనే మనస్తత్వం గల కవుల కొందరుంటారు. నలుగురూ నడిచే బాటలో నడవటంకన్నా సొంతబాట ఏర్పాటుచేసుకోవటం వీరికి బాగా ఇష్టం. ఇలాంటి కవులు రాసే కవిత్వం ప్రయోగ కవిత్వం. ఫిడేలు రాగాల డిజన్ రచించిన పఠాభి అలాంటి ప్రయోగకవి. పఠాభి పూర్తిపేరు తిక్కవరపు పట్ట్భారామరెడ్డి.
ప్రయోగాలకు కాలం చెల్లిందని కొందరు విమర్శకులు అనటం న్యాయం కాదు. శాస్తవ్రేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తేనే ఒక గొప్ప ప్రయోజనం. ఒక కొత్త పరిశోధన జాతికి లభిస్తుంది. చేసిన ప్రయోగాలన్నీ అద్భుత ప్రయోజనం, ఒక కొత్త పరిశోధన జాతికి లభిస్తుంది. చేసిన ప్రయోగాలన్నీ అద్భుత ప్రయోజనాల్ని అందించలేకపోవచ్చు. అరుదుగా లభించే అద్భుత ప్రయోజనాలకోసం అనంతంగా ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే కవిత్వంలో కూడా ప్రయోగ కవులు ప్రయోగాలు చేస్తుంటారు. అందులో మంచి ప్రయోజనాలుంటే తరువాత కవులు వాటిని ఉపయోగించుకొంటారు. ఉపయోగం లేని వ్యర్థ పదార్థాలను వదిలేసుకొంటారు. అలా కవిత్వంలో పఠాభి చేసిన ప్రయోగం ఫిడేలు రాగాల డజన్ అనే కవితల సంపుటి. తెలుగులో ముద్రింపబడిన తొలి వచన కవితల సంపుటి ఇది. ఈ ప్రయోగ కవిత్వం నిండా అన్నీ అద్భుతమైన విజయాలే లేకపోయినా కొన్ని మంచి ధోరణులు తరువాత కవులకు మార్గదర్శకమైనాయని చెప్పడంలో అసత్యం ఉండబోదు. ప్రయోగాలలో నిర్మాణాత్మక అంశాలను వదలి కేవలం చీకటి కోణాలను మాత్రమే దర్శించగలిగిన విమర్శకులు ఫిడేలు రాగాల డజన్ కవితల్ని రాగాల డజను కాదు, దీన్ని రోగాల డజన్ అనాలి అని బెజవాడ రామచంద్రారెడ్డి ప్రభృతులు తొందరపడ్డారు.
1930-40లమధ్య భావకవిత్వం మీద తిరుగుబాటు చేసి ప్రయోగాలు చేసిన కవులు శిష్ట్లా ఉమామహేశ్వరరావు, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు, పఠాభి ముఖ్యులు. భావ ప్రధానంగా తిరుబాటుచేసినవారు శ్రీశ్రీ, నారాయణబాబు, ఛందస్సు ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శిష్ట్లా, పఠాభి.
పఠాభిపై ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సెక్సు ప్రభావం చాలా వుంది. అలాగే వాల్ట్ విట్మన్ వచన గేయాలకు బాగా ప్రభావితుడైనాడు పఠాభి. ఇంకా పాశ్చాత్య సాహిత్యంలోని సర్రియలిజం ధోరణులు, పాశ్చాత్య కవుల చమత్కార ‘గమ్మత్తులు’, పఠాభిని బాగా ఆకర్షించాయి. సీత, ఆ రోజు నవ్య స్ర్తి, కామాక్షికోక అనే నాలుగు కవితలలో ఎలాంటి ఆచ్ఛాదన లేని కామోద్రేకాన్ని వర్ణించారు పఠాభి. ఈ నాలుగు కవితలే పఠాభిలోని మంచి లక్షణాల్ని చూడడానికి విమర్శకులడు అడ్డంగా నిలబడుతున్నాయి. ‘మతిచెడిన యువకుని ఉన్మత్త ప్రలాపాలు పఠాభి కవిత’లని దువ్వూరి రామిరెడ్డి విమర్శించారు. ‘‘సామాజిక చింతనమే రూపుమాపినపుడు వెలువవడిన ‘అహంభావ కవిత్వం’గా కె.వి.రమణారెడ్డి పఠాభి కవిత్వాన్ని కొట్టిపారేవారు. కాని పఠాభి ప్రయోగాలకు ఆకర్షితులైన పఠాభి కవితలలోని మంచి లక్షణాలను సాహితీ ప్రియులకు చక్కగా పరిచయం చేసినవారు ఆరుద్ర. అనుకరణ అసహ్యించుకొనే నవ కవిగా, కవిత్వంలో విచిత్ర సౌందర్యాన్ని ఆవిష్కరించే కొత్త కవిగా పఠాభిని శ్రీశ్రీ కూడా ప్రశంసించారు.
ఫిడేలు మన దేశానికి చెందిన వాద్యం కాదు, పాశ్చాత్యులది. ఆ ఫిడేలుమీద మన గాయకులు కర్ణాటక సంగీతాన్ని చక్కగా పలికిస్తున్నట్లు ఇంగ్లీషు కవితా రీతుల్ని తెలుగులో ప్రదర్శించవచ్చనే ఉద్దేశ్యంతో పఠాభి తన కవితల సంపుటికి ఫిడేలు రాగాల డజన్ అని పేరు పెట్టి ఉంటారని నారాయణరెడ్డి భావన. రాగాల డజన్ అంటే ఈ సంపుటిలోని పనె్నండు కవితలు విచిత్రమే సౌందర్యం, సౌందర్యమే విచిత్రం అన్న ఆస్కార్ వైల్డ్ అభిప్రాయాలకు దర్శనంగా నిలుస్తాయి.
ఫిడేలు రాగాల డజన్‌లో పఠాభి అంతవరకు ఆధిపత్యం చెలాయిస్తున్న గ్రాంధిక భాషపై తిరుగుబాటు చేశాడు. ఛందస్సుపై తిరుగుబాటు చేశాడు. అంతర్ముఖులైన కవులు రాస్తున్న భావకవిత్వం మీద తిరుగుబాటు చేశాడు.
‘‘నా రుూ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరుగదంతాను
చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని
చాలా దండిస్తాను.
అనుసరిస్తాను నవీన పంథా,కాని
భావ కవిన్ మాత్రము కాను నే
నహంభావ కవిని’’ అంటారు పఠాభి.
మంచి పద్యానికి మరణం లేదు అనేది వాస్తవం.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-రావి రంగారావు