వినమరుగైన

దీపావళి -వేదుల సత్యనారాయణ శాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ప్రణయ దుఃఖాన్ని మండి
నీలమై వంగి వాపోవు నింగి నెలత
నా కడనె నేర్చె బ్రణయ నియతి...’’
అనే ప్రణయమూర్తి శీర్షికలోని పద్యం ఆ కోవలోకి చేరుతుంది. అవని ప్రేయసి, ఆకాశం ప్రియుడు, అవనిని కలుసుకోలేని ఆకాశం ప్రణయ దుఃఖాగ్నితో మండిపోయింది. మండే అగ్ని ఒక అవస్థలో నీలవర్ణం చూపిస్తుంది. దానికి వస్తువును వంచే గుణం కూడా ఉంది. ఈ రెండు గుణాలూ ఆకాశానికి రావటంవలన దాని రంగు నీలంగాను, దాని భంగిమ వంగి వందనం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ప్రణయ ప్రణామం చక్కని పదభంగిమ. అలాగే మరోచోట కనిపించే బాష్ప భాషణం కూడా వినూత్న పద ప్రయోగం.
పెంపుడు నెమలిలో-
‘‘ఏల యింతటి చక్కదనాల వేళ
నెగురులాడ రెక్కలు రావు హృదయ సుధకు...’’ అంటారు వేదుల.
హృదయానికి రెక్కలు మొలవాలనుకోవటం అద్భుతమైన ఊహ.
అందుకే రాళ్ళపల్లి అనంతకృష్ణమాచార్యులవారు దీపావళి కావ్యాన్ని ప్రశంసిస్తూ- గౌతమీ తరంగాల అదృశ్యవాణి వేదులచే కోయిలగానం చేయించింది. అదే దీపావళి అన్నారు.
వెనె్నల, చీకటి కలిస్తేనే నెల. బ్రతుకూ అంతే! ... అందుకే ఓ చోట వేదులవారు ‘వెలుగు నీడల జీవన వేణువూది..’ అంటారు. ఆయన జీవితంలో కూడా అంతవరకు బాధించిన శిశిరం శిరస్సు వంచి వెళ్లిపోయింది. వసంతం వనె్న తొడిగింది. కవి కలం ఒక్కసారిగా గళం సవరించుకొంది. భావి భారతీయుని స్వరాజ్య గీతంకూడా ఇక్కడే సూచనప్రాయంగా చరణాలు మోపింది.
‘పాడుకొందును తాండవ మాడుకొందు
నా కుటీర మానంద నందనము నేడు..’’
అంటూ ఆ కలం దీపావళి గానం చేసింది.
ఆ కలం గళం 1976 జనవరి 7న తేదీన మూగవోయినా- ఆ వెలుగు దీపావళిలో నేటికీ కనిపిస్తున్నది.
ఒకరకంగా దీపావళిని వేదుల వెలిగించారనటం కంటే, దీపావళే వేదులను వెలిగించిందని భావిస్తే- అది మరింత ఔచితీపోషకంగా ఉంటుంది.

-అయిపోయింది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-రసరాజు