వినమరుగైన

తృణకంకణము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనుల నొండరులను చూచుకొనుటకన్న
మనసు లన్యోన్య రంజన గొనుటకన్న
కొసరి యేమోయి’యనిపిల్చుకొనుటకన్న
చెలుల కిలమీదనేని కావలయు సుఖుడ?
భావబంధురంగా తన మణిబంధానికి చిన్నపుడు కట్టిన పట్టుతోరంవిప్పుతావా? అని మాట్లాడలేక కనులు వాల్చింది.
నూత్నానురాగ విజ్ఞాన ప్రబోధితుడై ఆ స్నేహితతుడు ఏమీ పలుకలేక పోయారు. తరువాత ఆమె చేతి తోరం తీసివేసి, కుల్యాంతంలో పెరిగే తరుణార్ద్ర తృణాంకురాలు గిల్లి, వింతగా కంకణం రచించి తన స్నేహితురాలి మణిబంధానికి కట్టాడు- పరస్పర మైత్రీపతాకగా, అప్పుడామెనభ్యర్థిస్తాడు.
ఈ తృణ కంకణమ్ము ధరియింపుము
నీ మణి బంధమందు సం
ప్రీతిని నప్పుడప్పు వలపింపుల
నెయ్యము జ్ఞప్తి గొన్న ప్రా
భాతిక వేళ నీ ప్రణయ
బాష్ప కణాంజలి నింతయిచ్చి, యే
రీతిని వాడకుండానలరింపు
మిదే తుది వాంఛ సోదరీ!!!
ప్రకృతి స్నేహబద్ధ, ప్రకృతికి ప్రతీక, తృణం. వారిరువురి స్నేహం నిత్యకళ్యాణం పచ్చతోరణం. తృణకంకణం ధారణి, తన ముద్దుటుంగరాన్ని తన చిరకాల మిత్రుడి వ్రేలికలంకరించింది. పరస్పర మైత్రీ బంధమీరీతిగా సుస్థిరమైంది. శివశంకరులన్న కాళిదాసుని ప్రభావమిదే! ఈ కృతిలో రాయప్రోలువారి భావనా రామణీయకమంతా సాక్షాత్కరిస్తుంది. ప్రకృతి సౌందర్యానికీ కావ్యం అక్షర దర్పణం. మనిషిలో కావలసినంత పశుత్వముంది. మానవత్వమూ ఉన్నది. మానవత్వంలోని మహిత మాధుర్యం వెలార్చటం ఆర్షకవుల విజ్ఞత. కాళిదాసాది కవుల లాగే చేశారు. ఆ కోవలోనివారే అభినవ కవితాచార్యులు రాయప్రోలువారు.
ఈ కావ్యం విరచితమైన కాలం కంటే ఇపుడు స్ర్తి పురుషులు ఎక్కువగా కలిసి మెలసి విద్యనభ్యసిస్తూ ఉన్నారు. వివిధ సంస్థల్లో ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారిలో తృణకంకణం ప్రతిపాదించే స్నేహయోగం వర్థిల్లాలంటే ఆ కావ్యం నిత్యపారాయణం కావాలి.
-అయపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-కీ.శే.ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం