వినమరుగైన

తృణకంకణము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-కీ.శే.ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం
*
తెనుగే తీయని దందు పద్యపద
రీతి క్రీడ లత్యంత మో
హనముల్, శోభనముల్ తదీయ
రస, రక్తాలాపనంబుల్, లభిం
చిన వాగర్ధ కలా కలాప జయ
లక్ష్మిన్ గాలికిం బుత్తునే?
జననీ! యేమిటికింక? ఆశు కవితా
సన్యాస మిప్పింపవే!!
రసమో? భావమొ? జీవ దర్ధ
సుకుమార వ్యంజనా మంజు శ
బ్ద సమాసా రచనంబొ? సాధు హృదయ
స్పంద ప్రతిష్ఠా కథా
విసరంబో? సకలార్థ శూన్యమగు
నీ వేగాతి వేగొక్తి దు
ర్వ్యసనం భేటికి? త్రిప్పు మింక
జననీ! రమ్యాక్షర క్షోణికిన్’’
‘‘కపురంపుం బలుకుల్, తెనుంగులివి, వేగ ప్రక్రియా ధోరణీ విపరీతా నిలధాటిలో చెరగినన్ విధ్వంసమై పోదె తద్విపులా మోదము? మెత్తురే రసికులీ విన్యస వైకల్యమున్’’ అని పరిదేవనం చెందారు 1911 శ్రీ రాయప్రోలువారు. ఆశుకవితకు భరతవాక్యం పల్కారు. భావకవితకు నాందీ ప్రస్తావన కావించారు.
రాయప్రోలు వారి దృష్టి,ఆంగ్లంలో రసిక జన కామితమైన లిరిక్ రచనలపై ప్రసరించింది. ఆ భంగిమ, తెనుగులో సవదరించాలనిసంకల్పించారు. 1913 సంవత్సరారంభంలో అభినవ కవితా మండలి ది తెలుగు స్కూల్ ఆఫ్ రొమాంటిక్ రివైవల్ రాయప్రోలువారి తణకంకణం అనే చిరుకావ్యాన్ని ప్రచురించింది. ఇది చెన్నపురిలని కళాశాల విద్యార్థుల్ని అమితంగా ఆకర్షించింది. ఆ సంవత్సరంలోనే, రుూ చిన్ని కావ్యం, తృణకంకణం, మూడు ముద్రణలకు నోచుకొన్నది. కట్టమంచి వారి ప్రశంసనందుకొన్నది.
పాఠకలోకం లో అపోహమేమిటంటే- వర్డ్స్‌వర్త్, కాల్‌రిడ్జి, షెల్లీ, కీట్సు ప్రభృతుల కవితా ప్రభావంలో తృణకంకణం రచితమైందని. ఆ అపోహ తొలగాలని తల్లావఝల శివశంకరులు అన్నమాట లాలకించండి! ‘‘సుబ్బారావుగారు ఆంగ్ల కవితారసం ఆస్వాదించిన మాట వాస్తవమే. అయినప్పటికీ ఆ కవుల శక్తికి ముగ్ధులై ఈ కవి వరులు తృణకంకణం రచించలేదు. కాళిదాసు కవీంద్రుని నాటకత్రయం బహు పర్యాయాలు సాకల్యంగా సమాలోచనం చేసి ఆ మీదనే తృణకంకణం కూర్చినారు’’. ఇంకా శ్రీ శాస్ర్తీగారంటారు- ‘‘ఆ రోజుల్లో ఈ కృతివల్ల ఏదో క్రొత్తలోకంలోకి మార్గం ఏర్పడినట్లయింది.
-ఇంకా ఉంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-రాయప్రోలు సుబ్బారావు