జాతీయ వార్తలు

ఇంకా దొరకని విమానం ఆచూకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: చెన్నై నగరంలోని తాంబరం నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి కొద్దిసేపటికే అదృశ్యమైన వైమానిక దళానికి చెందిన విమానం కోసం రెండోరోజు శనివారం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిన్న ఉదయం 8:30 గంటలకు తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన 16 నిమిషాలకే కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
గాలింపు చర్యల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇక్కడికి చేరుకుంటున్నారు. తాంబరం వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు. బంగాళాఖాతంలో 18 నేవీ షిప్‌లు, ఒక జాలాంర్గామి, 8 యుద్ధ విమానాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విమానం గల్లంతై 27 గంటలు గడుస్తున్నా ఎలాంటి ఆచూకీ లభించలేదు. విమానం కూలిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విమానంలో ఆరుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది, 8మంది ఎన్ఏడి సిబ్బంది 29 మంది ఉన్నారు. వారిలో 8మంది విశాఖకు చెందిన వారు ఉన్నారు.