వీరాజీయం

ఎన్నాళ్లో వేచిన వేకువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్టికల్ 370ను రధ్దు చేస్తున్నామని హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించాక- రాష్టప్రతి వెంటనే గెజిట్ జారీ చేశారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం బదులు ఇక- జమ్మూ కశ్మీర్, లడఖ్ పేరిట రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి. దీంతో ఎన్నాళ్లు గానో భారతీయులలో అత్యధికులు కోరుతున్న సంస్కరణ ఎట్టకేలకు సాకారమైంది. కాంగ్రెస్ ఎంపీలు తప్ప -దీన్ని ఇదేదో హత్య , ఘోరం, అన్యాయం, పాపం, గీపం.. అంటూ ఎవ్వరూ గోల చెయ్యలేదు. భారతీయత అన్నది జేగీయమానంగా గా నలుదెసలా జేగంటలు మోగించింది.. భారత పార్లమెంటరీ చరిత్ర లోనే ఒక నూతన ప్రభాతభేరి మార్మోగింది. వ్యతిరేకతలు పిల్లికూతలై ‘పోయాయి’ . కశ్మీరియత ఇక మీదట భారతీయత అనే అందాల పుష్పగుచ్ఛంలో ఒక పుష్పపరిమళం మాత్రమే.. కశ్మీరీలకు వెలి ముగిసింది... అందరం ఒక్కటే అయిన శుభవేళ కాశ్మీరుకు అందరి జేజేలు! అనుమానం లేదు- ఆ రాష్ట్రానికి, దేశానికి కూడా మంచిరోజులకిది నాందీ ప్రస్తావన, జయహో అంటూ కీర్తించదగ్గ శుభ ఘడియలివి..
ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నట్లు - ఆదరాబాదరగా -ఈ సంస్కరణకు కేంద్రం పూనుకోలేదు. పక్కగా ఒక నెల రోజులకు పైగా-ఎంఎస్‌డిలు.. అనగా మోడీ , షా, దోవేల్‌లు రోడ్డు మ్యాప్ వేసి ముందుకు వెళ్ళారు. ఇదేదో కొత్తగా ఊడిపడ్డ ప్రతిపాదన అంతకన్నా కాదు. అమరనాథ్ యాత్ర బంద్ చేశారు- బలగాలను అచ్చం యుద్ధ సమయంలో తరలించినట్లు మోహరించారు - అంక్షలు విధించారు - స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు- మొబైల్స్ ఫోన్స్ ఆఖరికి ఇంటర్నెట్ కి కూడా సొడ్డు పెట్టారు. కానీ - సో కాల్డ్ ప్రజాస్వామ్య పరిరక్షకులకు -ఇంత పిసరు వాసన చిక్కలేదు-పుట్ట మీద తేలు కుట్టినా -నాగమయ్యదే పేరు అన్నట్లు - ఏదో టెర్రరిస్టులపై దాడి కోసం ఇదంతా ముందు జాగ్రత్త అనుకున్నారు. కొందరు పీవోకేపై మీద దాడికా?అని ఊహాగానం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)పై దాడి చేయడం. గతంలో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం. నియంత్రణ రేఖపై పట్టు సాధించడం. తద్వారా ఇటు తీవ్రవాదులకు అటు పాక్‌కు గట్టి హెచ్చరిక సంకేతం పంపడం ఒక పద్ధతి ఏమో గాని దీని వల్ల ఉగ్రవాదానికి చరమగీతం పలకడం సంగతి అటుంచి- ఇది మరో ఇండో-పాక్ యుద్ధానికి దారితీయొచ్చు.
మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు భాజాపా అధ్వర్యంలోని ప్రభుత్వం - మాట తప్పకుండా - 370, దాంతో పాటే 35ఎ ని రద్దుచెయ్యాలి -ఆ పనే చేసింది. జనాలు ఎన్నికల ప్రణాళిక ని చూడకుండానే వోట్లు వేశారా? ప్రత్యర్ధులకు, వ్యతిరేకులకు అన్ని దారులు బంద్ చేసి మరీ రాజ్యసభలో -తీర్మానం పెట్టి మూడింట రెండు వంతుల మెజారిటీ తో బల్లలు చరిచేశారు. ఇందులో అప్రజాస్వామికం -ఏమిటో? లోక్‌సభలో భాజపాకు నల్లేరుపై నడకే అని తెలుసు.
కశ్మీర్‌ని నిజంగా ప్రేమంచే వాళ్లు ఉంటే, దేశమంతటా ఒకే జాతీయత- ఒక నియమావళి ఉండాలని కోరే ప్రగతి కాముకులు ఈ చర్యని హర్షిస్తారు. మోడీ తో లేదా షా తో పోనీ భాజపా వైరం ఉన్నవాళ్లు ఉన్నారనుకోండి- వాళ్లయనా కృతకమైన అధికరణాన్ని ఎత్తివేయడాన్ని సమర్ధించాలి. ఆ పనే జగన్, కేసీఆర్, కేజ్రీవాల్ వగైరాలు చేశారు. ఈ ఆర్టికల్ తో నిజానికి కశ్మీర్‌కి ఏదో ప్రత్యేక హోదా, ప్రతిపత్తి లాంటిది ఉన్నవని అనుకుంటున్నారు గొప్పకి. కాని , ఇది వాస్తవానికి - ఒక మాదిరి ‘‘ వెలి’’ లాంటిదే. నిత్యం నెత్తురు కూడుని, ప్రాణ మాన ధన నష్టాన్ని మాత్రమే కశ్మీర్ ప్రజలకి ఇది ఇచ్చింది. ఏటా ఒక లెక్క ప్రకారం డెబ్భైవేల కోట్లు వెచ్చించి మరీ- కేంద్రం దానిని ఎదగకుండా చేసింది అన్నా తప్పులేదు. ఇటువంటి అడ్డుగోడలు ఒకే దేశంలో... ఇన్నాళ్లు ఉన్నాయా అంటే?.. విడ్డూరమే.
జిల్లాలు ఇరవైరెండు కాగా, అందులో కేవలం అయిదు జిల్లాలలో మాత్రం వేర్పాటు వాదం ప్రబలింది. శ్రీనగర్ ,అనంతనాగ్ ,బారాముల్లా, కుల్గాం ,పుల్వామాలువేర్పాటు వాదులున్నప్రాంతం .పైగా అవికూడా పాకిస్తాను సరిహద్దులకి బాగా దూరంగా ఉన్నాయి. పదిహేడు జిల్లాలు ఇండియా అంటే ఇష్టం గల ప్రాంతాలు అన్నమాట. వేర్వేరు మతాలు ,్ధర్మాలు నమ్మేటి వారు మొత్తం పద్నాలుగు జాతులున్నారు. షియాలు, బౌద్ధులు, క్రైస్తవులు లాంటి ఎందరో జాతుల వారు ఉన్నారు. కశ్మీరీ భాష మాట్లాడే వారి శతం 33 మాత్రమే ఉన్నా, వేర్పాటువాద హురియత్, ఎన్‌సి,పిడిపి లాంటి పార్టీలు ,శక్తులు అన్నీ వీళ్ళ చేతిలోనే ఉండటంతో -సంక్షోభం ముదురుతూ వస్తోంది- రాళ్లు రువ్వే కుర్రాళ్ళే మిలిటెంట్లుగా మారుతూ వచ్చారు. వ్యవసాయం , వ్యాపారం, దొరతనం తమ గుప్పిట పెట్టుకొని ఈ గ్రూపులు వేర్పాటు వాదాన్ని పురిగొల్పుతున్నాయ.
అంచేత మెజారిటీ ప్రజల పీక నొక్కి వాళ్ళకేదో కీడు తలపెట్టి -‘‘ఇండియన్ గవర్నమెంటు’’ ఈ రద్దు చర్య చేపట్టింది అన్నది పెద్ద అభాండం. కశ్మీరీల ఆస్తిపాస్తుల లావాదేవీలు, వివాహాది బంధాలు ఓ కొలిక్కి వస్తాయి ఇప్పుడు. దేశంలో ఎన్నో రిజర్వేషన్లు కేటాయింపులు - ప్రభుత్వ రంగంలోను ఇతరత్రా కూడా వున్నాయి. అవన్నీ ఇప్పుడు వీరికీ లభిస్తాయి . మళ్ళీ టూరిస్టులు... సినిమా షూటింగులు-పంచవర్ణ శోభిత సుఖశాంతులు కొలువుంటాయి. ఉద్యమాలు. అలర్లు, దహనకాండలు త్వరలో సమసిపోతాయి. మిగతా సోదర భారతీయులతో ఎత్తండి మన గెలుపు జెండా అంటూ మువ్వనె్నల జెండాని ఎగురవేయవచ్చును. రెండిటికీ చెడ్డ రేవడి లాగ కాక, గర్వంగా జైహింద్! అని భారతీయతను ఆస్వాదించవచ్చును.
ఓపెన్ యువర్ హ్యాండ్స్- ఏజ్ వైడ్ ఏజ్ పాజిబిల్ టు వెల్కమ్ దిస్ హిస్టారిక్ మూమెంట్..!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512