వారం వారం గోచారం

వారం వారం గోచారం (2-9-2018 నుంచి 8-9-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి. కుటుంబంలో అనుకూలత. ఆర్థిక నిల్వలపై ప్రత్యేక దృష్టి. అభీష్టాలు నెరవేరడంలో శ్రమ. సోమవారం మాట విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో గడిపే ప్రయత్నం. మాట తీరులో అనుకూలం. సంప్రదింపులుంటాయి. మంగళవారం కమ్యూనికేషన్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాదులకు సంబంధించిన ఒత్తిడులు, బుధవారం సౌకర్యాదులకోసం అధికమైన ప్రయత్నం. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యర్థమైన ప్రయాణాలు. గురువారం గృహవాహనాది వ్యవహారాలపై దృష్టి. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. పెద్దల పరిచయాలు. విందులు. శుక్రవారం సంతృప్తి లోపం. సౌఖ్యంకోసం ప్రయత్నం. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. సౌకర్యాలు శ్రమకు గురిచేయవచ్చు. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. బాధ్యతల ఒత్తిడులు. సోమవారం నిర్ణయాదుల్లో శుభపరిణామాలు. సంప్రదింపులకు అనుకూలం. కార్యక్రమాల నిర్వహణలో సంతోషం. మంగళవారం కుటుంబ ఆర్థికాంశాలపై దృష్టి. లక్ష్యాలను సాధించడంలో ఒత్తిడులు. దూరప్రయాణాదుల వల్ల నష్టాలు. బుధవారం సంప్రదింపుల్లో లోపాలు. కొన్ని వార్తలవల్ల కుటుంబంలో ఇబ్బందులు. నిల్వ ధనం, కాలం వ్యర్థం కావచ్చు. గురువారం కమ్యూనికేషన్స్ ప్రభావితంచేసే అవకాశం. పోటీరంగంలో విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శుక్రవారం అనుకోని సమస్యలు. అనారోగ్య భావనాలు. సౌఖ్యలోపం, సౌకర్యాదుల విషయంలోనూ జాగ్రత్త అవసరం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం అధికారిక సంప్రదింపులుంటాయి. ఖర్చులు, పెట్టుబడులు అధికం. పరామర్శలుంటాయి. వార్తలు సంతోషాన్నిస్తాయి. దగ్గరి ప్రయాణావకాశాలు. సోమవారం విశ్రాంతికోసం ప్రయత్నం. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. విందులు, వినోదాలుంటాయి. సంతోషం. మంగళవారం ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. అధికమైన విశ్వాసం కూడదు. అనుకోని ప్రమాదాలు. లోపాలు. బుధవారం కుటుంబంలో ఇబ్బందులు. ఆర్థిక నిల్వల లోపాలు. మాటతీరులో ఇబ్బందులు. చాంచల్య భావనలు. గురువారం ఆలోచనల్లో అనుకూలత. సంతానవర్గ వ్యవహారాల్లో సంతృప్తి. నూతన ప్రణాళికలుంటాయి. సృజనాత్మకత. శుక్రవారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో లోపాలకు అవకాశం.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం అన్ని పనుల్లో ప్రయోజన దృష్టి. లాభాల విషయంలో ఒత్తిడులు, కుటుంబంలో ఒత్తిడులకు అవకాశం. పెద్దల, అధికారుల ఆదరణ, ఆశీస్సులకోసం ప్రయత్నం. సోమవారం నిర్ణయాదుల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యక్రమాల్లో లాభాలు సంతృప్తినిస్తాయి. మంగళవారం భాగస్వామ్యాలకోసం ఖర్చులుంటాయి. స్నేహానుబంధాలకోసం వెచ్చిస్తారు. విందులు, వినోదాల్లో జాగ్రత్త. బుధవారం నిర్ణయాదుల్లో జాగ్రత్త. బాధ్యతల నిర్వహణలో సమస్యలు. అపోహలకు అవకాశం. పరామర్శలుంటాయి. గురువారం సౌకర్యాదులను పెంచుకునే ప్రయత్నం. ఆహార, విహారాల్లో అనుకూలత. బాధ్యతల నిర్వహణలో సంతృప్తి. శుక్రవారం వ్యతిరేక ప్రభావాలను శక్తియుతంగా ఎదుర్కోవాలి. పోటీ రంగంలో ఇబ్బందులు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. నిర్ణయాదులు ప్రశాంతంగా తీసుకోవాలి. బాధ్యతలు శ్రమకు గురిచేయవచ్చు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. శ్రమాధిక్యం. సోమవారం పదోన్నతి. కొన్ని ఖర్చులున్నా సంతోషం. విందులు, వినోదాలకు అవకాశం. గౌరవం పెరుగుతుంది. మంగళవారం పోటీరంగంలో విజయం. లాభాలుంటాయి. ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. పెద్దలతో జాగ్రత్త. బుధవారం వ్యర్థమైన ఖర్చులుంటాయి. కాలం, ధనం, శ్రమ వ్యర్థమయ్యే సూచనలు. దూరప్రయాణాలు. విశ్రాంతి లోపం. గురువారం పెద్దలతో సంప్రదింపులుంటాయి. దగ్గరి ప్రయాణాదులు. ధార్మిక కార్యక్రమాలకోసం ఖర్చులు. శుక్రవారం సంతానవర్గంకోసం కాలం ధనం వెచ్చిస్తారు. ఆలస్య నిర్ణయాలుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కీర్తిప్రతిష్ఠలపై దృష్టి. వ్యర్థమైన ఖర్చులుంటాయి. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. పరామర్శలకు అవకాశం. ప్రయాణాలుంటాయి. సోమవారం ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తిప్రతిష్ఠలుంటాయి. లాభాలు సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు. మంగళవారం వృత్తిఉద్యోగాదుల్లో జాగ్రత్త. సంతానవర్గ వ్యవహారాల్లో శ్రమ. గౌరవ లోపాలకు అవకాశం. బుధవారం అన్ని పనుల్లో ప్రయోజనం. లాభాలున్నా సంతృప్తి ఉండదు. అత్యాశ ఇబ్బంది పెడుతుంది. జాగ్రత్త. గురువారం కుటుంబ ఆర్థికాంశాల్లో అత్యంత అనుకూలత. అన్ని పనుల్లోనూ లాభాలు. పెద్దల అనుకూలత. సంతృప్తి. శుక్రవారం సౌకర్యలోపాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాల్లో ఒత్తిడులు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం అన్ని పనుల్లో జాగ్రత్త. అధికారిక లాభాలున్నా అనుకోని నష్టాలకు అవకాశం. ముఖ్యమైన పనులను వాయిదావేసుకోవడం మంచిది. ఊహించని సంఘటనలు. సోమవారం సామాజిక గౌరవం తగ్గవచ్చు. పనిచేసేచోట జాగ్రత్తగా మెలగాలి. అనుకోని ఇబ్బందులు. నష్టాలుంటాయి. మంగళవారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కొన్ని సౌకర్య లోపాలు. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. బుధవారం సామాజిక గౌరవం సాధించే ప్రయత్నం. కార్యనిర్వహణ బాధ్యతలు అధికం. అయినా తగిన గుర్తింపుఉండదు. గురువారం నిర్ణయాదుల్లో శుభపరిణామాలు. వ్యవహారాల్లో శుభపరిణామాలు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. శుక్రవారం సేవక వర్గ సహకారం లభిస్తుంది. పేరుప్రఖ్యాతులు పెంచుకునే అవకాశం.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగ సంబంధమైన ఒత్తిడులు. వ్యాపారాదుల్లో జాగ్రత్త అవసరం. అధికారిక అనుబంధాలుంటాయి. సోమవారం లక్ష్యాలను సాధిస్తారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శ్రమ ఉన్నా సంతోషం. వినోదాలు. మంగళవారం అన్ని పనుల్లో జాగ్రత్త. అనుకోని నష్టాలు. అనారోగ్య లోపాలుంటాయి. సంప్రదింపుల్లో ఒత్తిడులు. బుధవారం దూర ప్రయాణాదులపై దృష్టి. లక్ష్యాలను సాధించడంలో శ్రమ. ఉన్నత వ్యవహారాల్లో లోపాలుంటాయి. గురువారం ధార్మికమైన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాదులుంటాయి. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. గౌరవం. శుక్రవారం మాట విలువ తగ్గే సూచనలు. ఆర్థిక నిల్వల విషయంలో జాగ్రత్త.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీ రంగంలో విజయం సాధిస్తారు. ఉన్నత లక్ష్యాలపై దృష్టి, శత్రువులు, ఋణాలు, రోగాలు ప్రభావితం చేస్తాయి. సంతృప్తిలోపం. సోమవారం పోటీలు ఒత్తిడులు తప్పక పోవచ్చు. అనుకోని ఇబ్బందులు. అనారోగ్య భావనలు. నిర్ణయ లోపాలుంటాయి. మంగళవారం భాగస్వామ్యాల్లో అనుకూలత. కుటుంబ ఆర్థికాంశాల్లో ఒత్తిడులుంటాయి. అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. బుధవారం అనుకోని సమస్యలుంటాయి. పరిచయాలు ఇబ్బందిపెడతాయి. భాగస్వామ్య సంబంధాల్లో అప్రమత్తం. గురువారం కొన్ని ఊహించని సంఘటనలున్నా అధిగమిస్తారు. పెద్దల అనుకూలత. నిర్ణయాదులను వాయిదావేయాలి. శుక్రవారం నిర్ణయాదుల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. బద్ధకం పెరిగే అవకాశం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ సంతృప్తి. అనుకోని సమస్యలుంటాయి. కాలం ధనం శ్రమ వ్యర్థమయ్యే సూచనలు. టాక్స్‌లు చెల్లించాలి. సోమవారం సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త పనులపై దృష్టి. నూతన ప్రణాళికలు. పిల్లలకోసం కాలం ధనం వెచ్చిస్తారు. మంగళవారం వ్యతిరేక ప్రభావాలు అధికం. తొందరపాటు కూడదు. మాటపడే అవకాశం. ప్రమాదాలు. బుధవారం పరిచయాలు అనుబంధాల్లో ఇబ్బందులకు అవకాశం. నూతన వ్యక్తులవల్ల కాలం, ధనం కోల్పోవచ్చు. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. భాగస్వామ్యాలు సంతృప్తినిస్తాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. శుక్రవారం వ్యర్థమైన ఖర్చులుంటాయి. కాలం ధనం కోల్పోయే అవకాశం. అన్ని పనుల్లో జాగ్రత్త. పరామర్శలుంటాయి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం ఆహార విహారాదులపై దృష్టి. పరిచయాలు భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. అధికారిక పరిచయాలుంటాయి. సౌకర్యాదులు శ్రమకు గురిచేస్తాయి. సోమవారం వ్యతిరేక ప్రభావాలున్నా సంతోషంగా గడుపుతారు. కార్యనిర్వహణలో సంతృప్తి. సౌఖ్యం. ప్రయాణాలుంటాయి. మంగళవారం కాలం, ధనం వ్యర్థంకావచ్చు. సంతానవర్గంకోసం వెచ్చిస్తారు. తొందరపాటు కూడదు. బుధవారం పోటీరంగంలో విజయంకోసం తీవ్ర ప్రయత్నం. వ్యతిరేకతలు పెరిగే సూచనలు. అప్రమత్తంగా మెలగాలి. గురువారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాలుంటాయి. గుర్తింపు, గౌరవాదులు విస్తరిస్తాయి. శ్రమాధిక్యం. శుక్రవారం లాభాలు ఇబ్బంది పెట్టవచ్చు. ప్రయోజనాల విషయంలో అప్రమత్తం. ఆలస్య నిర్ణయాదులు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవర్గ వ్యవహారాలపై దృష్టి. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. పోటీలు ఒత్తిడులపై దృష్టి. సోమవారం మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ వ్యవహారాలలో అనుకూలత. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంగళవారం సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. లాభాలున్నా కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆహార విహారాల్లో జాగ్రత్త. బుధవారం ఆలోచనల్లో జాగ్రత్త. ఆహార విహారాల్లో సమస్యలుంటాయి. సంతానవర్గ వ్యవహారాల్లో సమస్యలుంటాయి. గురువారం గౌరవ లోపాలకు అవకాశం. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. వ్యవహారాల్లో కొంత అనుకూలత. సంతోషం. శుక్రవారం ఆలోచనల్లో శుభపరిణామాలు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744