వారం వారం గోచారం
వారం వారం గోచారం (22.3.2020 నుంచి 28.3.2020 వరకు)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ లాభాపేక్ష ఉంటుంది. పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ప్రయోజనాలు సంతృప్తినిస్తాయి. వ్యవహారాల్లో అనుకూలత. నూతన కార్యక్రమాల ప్రారంభం. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. ఉన్నత లక్ష్యాల వైపు దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరించే అవకాశం. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. విశ్రాంతి కోసం ప్రయత్నం. ప్రయాణాలకు అవకాశం. పరామర్శలుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమాధిక్యం. పదోన్నతులకు, సామాజిక గౌరవానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. వ్యాపారాదుల్లో ప్రయోజనాలు అధికవౌతాయి. వ్యవహార విజయం. ఆరోగ్యం, సౌఖ్యంపై దృష్టి కేంద్రీకరిస్తారు. వారాంతంలో ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలపై దృష్టి. సామాజిక గౌరవం పెంచుకుంటారు. పితృవర్గ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. ఆర్థిక నిల్వలు కోల్పోకుండా చూడాలి. గౌరవ లోపాలకు అవకాశం ఉంది. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాపేక్ష పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలపై దృష్టి. అధికారిక ప్రయోజనాలు. ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. కార్యనిర్వహణలో సంతోషం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. విందులు విలాసాలు వినోదాలపై దృష్టి ఉంటుంది. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణావకాశాలుంటాయి.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. సుదూర ప్రయాణ భావనలు. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. దానధర్మాల వల్ల సంతృప్తి. నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. కార్యనిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక సమస్యలున్నా పదోన్నతులకు అవకాశం. సామాజిక గౌరవం పెరుగుతుంది. పితృవర్గ వ్యవహారాల్లో అనుకూలత. కొన్ని అనుకోని ఇబ్బందులుంటాయి. వ్యాపారాదుల్లో మంచి ఫలితాలుంటాయి. సంతోషంగా గడుపుతారు. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాపేక్ష అధికవౌతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అశ్రద్ధ పెరుగుతుంది. శ్రమతో కార్యాలు. వ్యవహారాల్లో లోపాలుంటాయి. సమస్యలను అధిగమించాల్సి వస్తుంది. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. విశ్రాంతి లోపం. వ్యతిరేకతలు పెరిగే అవకాశం. పోటీలు, ఒత్తిడులు అధికం. వారం మధ్యమంలో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత. వ్యవహారాల్లో సంతృప్తి. దైవ, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్యాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాదుల్లో కొంత జాగ్రత్త వహించాలి. కీర్తిప్రతిష్టలు పెంచుకోవడంలో కొంత శ్రమ ఉంటుంది. దానధర్మాల వల్ల మరింత మేలు కలుగుతుంది. ప్రశాంతంగా ఉండాలి. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఉన్నా గుర్తింపు ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు విస్తరిస్తాయి. అనుబంధాలలో సంతృప్తి. వ్యాపారాదులు పెంచుకుంటారు. లాభాలు అతిగా ఆశించే అవకాశం. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. ఆలోచనలకు రూపకల్పన. సంతాన వర్గంతో సంతోషం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వ్యాపార భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. వారం మధ్యమంలో అనుకోని ఇబ్బందులు. అనారోగ్య భావనలు. శ్రమాధిక్యం. అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలకు దూరంగా మెలగాలి. ఒత్తిడులను అధిగమించాలి. భాగస్వామ్యాల్లోనూ సమస్యలు అధికవౌతాయి. పరిచయాల వల్ల కాలం ధనం వ్యర్థవౌతాయి. వారాంతంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో పోటీలు ఒత్తిడులు అధికం. శ్రమాధిక్యం. అన్ని పనుల్లోనూ ముందు జాగ్రత్తలు అవసరం. రెసిస్టెన్స్ పెంచుకుంటారు. అందరినీ కలుపుకుని పోవాలి. దైవ సహకారం స్వీకరించాలి. వృత్తిలో అనేక రకాల బాధ్యతలుంటాయి. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. సౌఖ్యంగా కాలం గడుపుతారు. వారం మధ్యమంలో భాగస్వామ్యాలపై దృష్టి. అధికారిక పరిచయాలుంటాయి. కొత్త పనులపై దృష్టి. కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. ప్రణాళికల్లో లోపాలు. సంతాన వర్గంతో ఇబ్బందులుంటాయి. స్పెక్యులేషన్స్ ఇబ్బంది పెట్టే సూచనలు. వ్యితిరేకతలున్నా విజయ సాధన. శ్రమ ఉన్నా ఫలితాలు అధికం. వ్యాపారాదుల్లో లాభాలు. వారాంతంలో సమస్యలను అధిగమించాల్సి వస్తుంది. అనేక రూపాల్లో ఇబ్బందులు. సౌకర్య లోపాలకు అవకాశం.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. ప్లానింగ్ ఫలిస్తుంది. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. కొత్త నిర్ణయాదులకు అనుకూలం. సుదూర ప్రయాణ అభిలాష, ప్రయత్నాలు కొనసాగుతాయి. కొంత అసంతృప్తి. పెద్దల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలం. వారం మధ్యమంలో పోటీలు, ఒత్తిడులను అధిగమించాలి. వ్యతిరేకతలపై విజయం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గుర్తింపు లభిస్తుంది. సౌకర్య లోపాలు. ఆహార విహారాల్లో సమస్యలు. క్రియేటివిటీ పెంచుకుంటారు. కొత్త పనుల కొనసాగింపు. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. పెట్టుబడులకు అనుకూలం. వారాంతంలో భాగస్వామ్యాలు ప్రభావితం చేస్తాయి.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. సౌఖ్యం కోసం ప్రయత్నిస్తారు. గృహ వాహనాదులు సమకూర్చుకుంటారు. కొన్ని అనుకోని సమస్యలుంటాయి. ఆహార విహారాదుల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. కొన్ని మానసిక ఒత్తిడులు. క్రియేటివిటీ పెరుగుతుంది. సేవకవర్గ సహకారం లభిస్తుంది. సంప్రదింపుల్లో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. విద్యారంగంలో శుభ పరిణామాలు. సంతానవర్గం సంతృప్తి. కొత్త నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. వారాంతంలో వ్యతిరేకతలు, పోటీలు, చికాకులుంటాయి. అందరితోనూ ప్రశాంతంగా మెలగాలి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. వ్యాపార వర్గ సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు తప్పకపోవచ్చు. విందులు, విహారాలు, విజ్ఞాన యాత్రలకు అవకాశం. భాగస్వామితో కొంత జాగ్రత్తగా మెలగాలి. పరిచయాల వల్ల కాలం ధనం వ్యర్థం కావచ్చు. నిర్ణయాదులకు అనుకూలం. గౌరవం పెంచుకుంటారు. అన్ని పనులకూ అనుకూలత. వారం మధ్యమంలో ఆహార విహారాల్లో జాగ్రత్త. సౌకర్య లోపాలు. శ్రమ ఎక్కువ. విద్యారంగంలోని వారికి అధికమైన శ్రమ. మాట విలువ తగ్గే సూచనలు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మీడియా రంగంలోని వారికి అనుకూలత. గృహ వాహనాదుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్త పనులపై దృష్టి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. బంధువర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. బ్యాంకు వ్యవహారాల పూర్తి. నిల్వధనంపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. శ్రమ ఉన్నా కార్యక్రమాల నిర్వహణలో అందరూ సంతృప్తి పొందుతారు. ముందు జాగ్రత్తలు అవసరం అవుతాయి. దానధర్మాల వల్ల అత్యధికమైన మేలు కలుగుతుంది. వారం మధ్యమంలో అధికారికమైన సంప్రదింపులుంటాయి. కొత్త సమాచారం లభిస్తుంది. పై అధికారుల సహకారం. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సోదరవర్గ వ్యవహారాలను చర్చిస్తారు. నిర్ణయాదుల్లో జాగ్రత్త. తొందరపాటుతో అన్నీ కోల్పోయే అవకాశం. మాటల్లో చమత్కార ధోరణి. వ్యాపారాదులకు అనుకూలం. వారాంతంలో ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. గృహ వాహనాదులు సమకూర్చుకుంటారు.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని పనుల్లోనూ శుభ పరిణామాలు. బాధ్యతలు విస్తరిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. ఆలోచనలు పరిపరి విధాల వెళ్లే అవకాశం. సంతానంతో కొంత ఒత్తిడి. పెద్దల ఆశీస్సులు. అనుకూలత. గౌరవం. లాభాలు అధికవౌతాయి. వారం మధ్యమంలో మాటల్లో కొంత అధికారిక ధోరణి. జాగ్రత్త అవసరం. తొందరపాటు కూడదు. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. విశ్రాంతి, సంతోషాదులకు ప్రయత్నించి విఫలవౌతారు. నిర్ణయాదులకు అనుకూలం. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. వ్యవహార దక్షత ఉంటుంది. చమత్కారంగా ప్రవర్తిస్తారు. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. కాంట్రాక్టు వ్యవహారాలు లాభిస్తాయి. ఆశించిన లాభాలు అందకపోవచ్చు.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. విశ్రాంతి లభిస్తుంది. వ్యాపారాదుల్లో పెట్టుబడులుంటాయి. పరామర్శలకు కూడా అవకాశం. సౌకర్యాదుల విషయంలో ఆశించిన సంతృప్తి ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు, గౌరవాదులుంటాయి. సామాజిక గౌరవం పెంచుకుంటారు. వారం మధ్యమంలో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. శ్రమతో కార్యాలు. కొంత ఒత్తిడి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. అన్ని పనుల్లోనూ శుభ పరిణామాలు. ఆశించిన లాభాలు అందకపోవచ్చు. కొంత శ్రమించాలి. వ్యాపారాల్లో పెట్టుబడులు. విశ్రాంతి లభిస్తుంది. వారాంతంలో మాటల్లో చమత్కారం. కుటుంబం, బంధువర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఆర్థిక నిల్వలు పెంచుకుంటారు.