వారం వారం గోచారం

వారం వారం గోచారం (3-2-2019 నుంచి 9-2-2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. స్థాయిని పెంచుకునే ప్రయత్నం ఉంటుంది. ఆలోచనలకు రూపకల్పన. అభీష్టసిద్ధి కలుగుతుంది. అధికారిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. గృహ వాహనాదులు సమకూర్చుకుంటారు. సంతోషంగా గడుపుతారు. హోదా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. తొందరపాటు కూడదు. విశ్రాంతి లోపించే అవకాశం. ఆహార విహారాల్లో కొంత సమస్యలు తప్పవు. లాభాలున్నా ఆశించిన ఫలితాలు అందకపోవచ్చు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. కొంత గౌరవ లోపానికి కూడా అవకాశం. సంతృప్తి లోపం. పెద్దల ఆశీస్సుల విషయంలో జాగ్రత్త. ఆధ్యాత్మిక వ్యవహారాల వల్ల మేలు కలుగుతుంది. దూర ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం పోటీలు ఒత్తిడులున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు కోసం అధికంగా ప్రయత్నిస్తారు. వ్యతిరేకతలు తప్పకపోవచ్చు. శ్రమాధిక్యం. శత్రువుల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. అన్ని పనుల్లోనూ శ్రమతో కూడుకున్న అనుకూలత. కార్యదక్షత ఉంటుంది. ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. నూతన వ్యవహారాల్లో సంతోషం. కొన్ని ప్రమాదాలకు అవకాశం. సంతృప్తి లోపాలుంటాయి. సామాజిక భాగస్వామ్యాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. వ్యర్థమైన ఖర్చులు, ప్రయాణాలు ఉంటాయి. విశ్రాంతి లోపం. ఊహించని సంఘటనలుంటాయి. అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు పెరగవచ్చు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెంచుకునే ప్రయత్నం. నిల్వధనం కోసం ఆరాటం ఉంటుంది. దాచుకోవడంపై దృష్టి తగ్గించడమే మేలు. మాటల్లో కొంత అధికారిక ధోరణి తగ్గించుకోవాలి. కొన్ని అనుకోని సమస్యలుంటాయి. ఊహించని సంఘటనలకు అవకాశం. ఇతరుల సహకారం కోసం ప్రయత్నిస్తారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు తప్పకపోవచ్చు. కొన్ని వార్తల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు చర్యలు కూడదు. వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. సేవారంగంలో అనుకూలత. ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మేలు. ప్రయాణాలకు అవకాశం. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలు, స్థిరాస్తులపై ప్రత్యేక దృష్టి. విద్యాత్మక వ్యవహారాల్లో శుభ పరిణామాలు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం కీర్తి ప్రతిష్టలపై దృష్టి కేంద్రీకరిస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం. సామాజిక హోదా పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉన్నత వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. అనుకోని ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మిక భావనలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆహార విహారాలకు అనుకూలం. లాభాలున్నా కొంత జాగ్రత్తగా మెలగాలి. ఖర్చులు పెట్టుబడుల విషయంలో అప్రమత్తత అవసరం. వృత్తి ఉద్యోగాదులు సంతోషాన్నిస్తాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. పదోన్నతులకు, గుర్తింపులకు అవకాశం అధికం. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పెద్దలతో సంప్రదింపులుంటాయి. ఆధ్యాత్మిక వేత్తలను కలుసుకుంటారు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో సంతోషంగా గడుపుతారు. అభీష్టాలు నెరవేరుతాయి. సృజనాత్మక శక్తిని పెంచుకుంటారు. సంతానం కోసం కొన్ని ఖర్చులు తప్పకపోవచ్చు. కొత్త వ్యవహారాల నిర్వహణ ఉంటుంది. కార్యసిద్ధి. మనసులోని భావాలకు క్రియా రూపం వస్తుంది. కొన్ని పోటీలుంటాయి. విజయం సాధించే ప్రయత్నం. గుర్తింపు గౌరవాలు అధికంగా ఉంటాయి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. కార్యనిర్వహణ దక్షత. కొన్ని అనుకోని ఇబ్బందులు ప్రమాదాలకు అవకాశం. అప్రమత్తంగా మెలగాలి. లాభాల విషయంలో కొంత జాగ్రత్తగా మెలగాలి. క్రమంగా భాగస్వామ్యాలు విస్తరిస్తాయి. నూతన పరిచయాలు సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. పెద్దలతో సంప్రదింపులుంటాయి. భాగస్వామితో కలిసి ప్రయాణాలు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. అనేక కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. బాధ్యతలు విస్తరిస్తాయి. శరీర సంరక్షణపై ప్రత్యేక దృష్టి. ఒత్తిడులు కూడా ఉంటాయి. కొంత అనారోగ్య భావన. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరించినా ఏదో కొంత వెలితి ఉంటుంది. శ్రమాధిక్యం. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. కుటుంబ వ్యవహారాలు, అనుబంధాలపై దృష్టి. మాట తీరులో మార్పులుంటాయి. మాట వల్ల గుర్తింపు పెంచుకుంటారు. సౌకర్యాల లోపం వల్ల సమస్యలుంటాయి. పెద్దల అనుకూలత. లాభాలు అత్యధికం. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. భాగస్వామ్యాల్లో కొంత ఘర్షణ ఉంటుంది. అన్ని పనుల్లోనూ అనుకూలత. సంప్రదింపులుంటాయి. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలకు అవకాశం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం అనుకోని సమస్యలను అధిగమించాలి. కొన్ని ఊహించని ప్రయోజనాలున్నా అవి సమస్యలకు దారి తీయవచ్చు. అప్రమత్తంగా మెలగాలి. వీలును బట్టి ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. సంప్రదింపుల్లో ఇబ్బందులకు అవకాశం. సహకార లోపాలు. క్రమంగా కీర్తి ప్రతిష్ఠలకు అవకాశం. గుర్తింపు, గౌరవాలు సిద్ధిస్తాయి. ఉన్నత వ్యవహారాలుంటాయి. నిల్వధనం పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఘర్షణ తప్పకపోవచ్చు. అధికారులతో అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం ఉంది. కుటుంబ ఆర్థికాంశాలపై అత్యాశ. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట తీరు విషయంలో జాగ్రత్త. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. పోటీ రంగంలో విజయం సాధిస్తారు. గుర్తింపు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం గృహ వాహనాది వ్యవహారాలపై దృష్టి. ప్రయాణాది సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. శ్రమ ఉన్నా ఫలితాల విషయంలో అనుకూలత. సౌఖ్యం కోసం అన్ని రకాల ప్రయత్నాలుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత పెరుగుతుంది. ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెరుగుతుంది. సంతానంతో సంతోషంగా గడుపుతారు. స్పెక్యులేషన్‌కు అనుకూలత. కొత్త పనులపై దృష్టి. అధికారిక వ్యవహారాలపై దృష్టి. అనేక బాధ్యతలుంటాయి. శ్రమ ఉన్నా ఫలితాలుంటాయి. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ, నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. క్రమంగా వ్యతిరేకతలను అధిగమించాలి. పోటీలు ఒత్తిడులు తప్పకపోవచ్చు. శత్రు రుణ రోగాదుల విషయంలో అప్రమత్తంగా మెలగాలి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

1ఈ వారం ఖర్చులు పెట్టుబడులు తప్పవు. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా గడుపుతారు. దానధర్మాల వల్ల అధికమైన మేలు. లేలకుంటే వ్యర్థమైన ఖర్చులకు అవకాశం. భాగస్వామి కోసం కాలం, ధనం వెచ్చించాలి. వ్యతిరేకతలున్నా అధిగమిస్తారు. ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. నిర్ణయాదులకు అనుకూలం. బాధ్యతలు క్రమంగా విస్తరిస్తాయి. అనేక పనుల్లో తలమునకలు కావలసి వస్తుంది. తొందరపాటు కూడదు. నూతన కార్యక్రమాల వల్ల మేలు. వ్యవహార విజయం. ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాల నిర్వహణ. సంప్రదింపులకు అనుకూలం. పోటీలు వత్తిడులు చికాకులు తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో గౌరవం. సామాజిక వ్యవహారాల్లో ఉన్నత. కుటుంబ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక నిల్వలు పెంచుకునే దృష్టి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడవచ్చు. పితృవర్గంతో చర్చలు, సమావేశాలుంటాయి. నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. కార్యనిర్వహణలో అనుకూలత. కొన్ని అనుకోని ఇబ్బందులు. అనారోగ్య భావనలుంటాయి. ముఖ్యంగా నిర్ణయ లోపాలకు అవకాశం. కొత్త పనుల ఎంపికలో జాగ్రత్తలు అవసరం. ఊహించని సంఘటనలకు, నష్టాలకు అవకాశం. అప్రమత్తంగా మెలగాలి. క్రమంగా ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో సంతోషంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. సుదూర ప్రయాణావకాశాలు. కీర్తి ప్రతిష్టల వల్ల సంతోషం. పోటీ రంగంలో శుభ పరిణామాలు. విజయ సాధనకు కొంత శ్రమించక తప్పదు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం కోసం ప్రయత్నం. సోదర వర్గ వ్యవహారాలు కొన్ని ప్రభావితం చేస్తాయి. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. భావ ప్రసారం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. అధికారిక సహకారం లభిస్తుంది. వృత్తిలో అనుకూలత. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. గృహ వాహనాది రంగాలలో నూతనమైన ఆలోచనలు ఏర్పడవచ్చు. స్థిరాస్తులను పెంచుకునే ప్రయత్నం. కొత్త వస్తువులపై దృష్టి. సుదూర ప్రయాణాలపై దృష్టి. నిర్ణయాదులకు అనుకూలం. కొత్త పనులను నిర్వహిస్తారు. ఆశించిన ఫలితాలను అందుకుంటారు. ఆలోచనలకు రూపకల్పన. సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. నూతన కార్యక్రమాల ప్రణాళికలుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం అన్ని పనుల్లో ప్రయోజనాలతో ప్రారంభిస్తారు. లాభాలు సంతోషాన్నిస్తాయి. అధికారిక ప్రయోజనాలుంటాయి. పెద్దలతో పరిచయాలు మెరుగుపడతాయి. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. సంతానం వల్ల కొత్త గుర్తింపు ఏర్పడుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. ఖర్చులు కూడా తప్పవు. విశ్రాంతి కోసం ప్రయత్నం. ఆహార విహారాలుంటాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలపై దృష్టి. దానధర్మాలపై దృష్టి పెంచుకోవాలి. కుటుంబంలో కొంత జాగ్రత్త. తొందరపాటు మాటలు కూడదు. నిర్ణయాలలోనూ అప్రమత్తంగా మెలగాలి. కొత్త పనులను శీఘ్రంగా పూర్తి చేయాలని నిర్ణయాదులు తీసుకున్నా ముందుకు సాగకపోవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. బాధ్యతల విస్తరణ అన్ని పనుల్లోనూ సంతృప్తి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744