వారం వారం గోచారం

వారం వారం గోచారం (25-11-2018 నుంచి 1-12-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం కమ్యూనికేషన్స్ పెంచుకుంటారు. కొత్త వార్తలు అందుతాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. ఊహించని ప్రయోజనాలుంటాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సోమవారం సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి. సహకారం లభిస్తుంది. గౌరవ లోపాలకు అవకాశం. మంగళవారం ఆధ్యాత్మిక ప్రయోజనాలపై దృష్టి. గృహ వాహనాది సౌకర్యాల విషయంలో జాగ్రత్త అవసరం. బుధవారం వ్యాపారాదుల్లో ఇబ్బందులకు, నష్టాలకు అవకాశం. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టవచ్చు. సౌఖ్య లోపాలుంటాయి. గురువారం ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. వృత్తి ఉద్యోగాదులకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వస్తాయి. శుక్రవారం భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సంతానవర్గ అనుకూలత. క్రియేటివిటీ.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం అన్ని పనుల్లో లాభాలు ప్రభావితం చేస్తాయి. కొత్త ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు. పెద్దల ఆశీస్సులుంటాయి. భాగస్వామ్యాల్లో ఒత్తిడులకు అవకాశం. పరిచయాల వల్ల సమస్యలు. సోమవారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. ఆహార విహారాల్లో అనుకూలత. సౌఖ్యంగా, సౌకర్యవంతంగా గడుపుతారు. మంగళవారం ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. ఆలస్య నిర్ణయాల వల్ల ఇబ్బందులు. మానసిక వత్తిడులు. ఖర్చులధికం. బుధవారం ప్రయాణావకాశాలు. విహార యాత్రలపై దృష్టి. గృహ వాహనాదులు సంతోషాన్నిస్తాయి. విశ్రాంతి. గురువారం నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. బాధ్యతల నిర్వహణలో జాగ్రత్త అవసరం. వ్యతిరేక ప్రభావాలుంటాయి. శుక్రవారం సంప్రదింపులుంటాయి. మంచి వార్తలుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం పరిచయాలు, భాగస్వామ్యాల్లో అనుకూలత. అనుబంధాలు విస్తరిస్తాయి. సోదర వర్గంతో కొంత జాగ్రత్త. సహకార లోపాలకు అవకాశం. అనుకోని ఇబ్బందులుంటాయి. సోమవారం ఊహించని సంఘటనలుంటాయి. ధార్మికమైన ఖర్చులకు అవకాశం. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. మంగళవారం ఆలస్యంగా నిర్ణయాలుంటాయి. బద్దకం పెరుగుతుంది. అనుకోని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. బుధవారం వ్యాపారాదుల్లో పెట్టుబడులు పెట్టాలి. భాగస్వామ్యాల్లో జాగ్రత్త. వృత్తి వ్యాపారాదుల్లో నష్టాలుంటాయి. గురువారం లక్ష్యాలపై దృష్టి. ఉన్నత విద్య, ఉద్యోగ, కీర్తి ప్రతిష్టలు ప్రభావితం చేస్తాయి. మాటల్లో నిరాశ తప్పదు. శుక్రవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. వ్యతిరేకతలపై విజయం. అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం నిల్వధనం పెంచుకునే భావనలు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. మాట్లాడే ధోరణిలో జాగ్రత్త. సోమవారం దగ్గరి ప్రయాణాలకు అవకాశం. కొన్ని వార్తల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. ఆర్థిక వ్యవహారాలపై దృష్టి. మంగళవారం అనుకోని సమస్యలు. సంప్రదింపులు ఇబ్బంది పెట్టవచ్చు. కాలం ధనం శ్రమ వ్యర్థం కాకుండా చూడాలి. బుధవారం వ్యాపారాదులు వృద్ధి చేసుకునే ప్రయత్నం. భాగస్వామ్యాలు విస్తరిస్తాయి. కొత్త సమాచారం ఉంటుంది. గురువారం ఆహార విహారాదులపై దృష్టి. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. కొంత నైరాశ్య ధోరణి. శుక్రవారం వ్యతిరేక ప్రభావాలున్నా విజయం సాధిస్తారు. పోటీలు, ఒత్తిడులు, చికాకులుంటాయి. గుర్తింపు లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అన్ని పనుల్లో పోటీలు ఎదురైనా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. పదోన్నతి. సోమవారం లాభాలున్నా కొంత అప్రమత్తంగా మెలగాలి. పెద్దలతో సంప్రదింపులుంటాయి. భాగస్వామి సహకారం. మంగళవారం ఆహార విహారాల్లో జాగ్రత్త. సౌఖ్య లోపం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. లాభాలు కోల్పోవచ్చు. బుధవారం కొత్త వార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. అందరి సహకారం లభిస్తుంది. గురువారం ఖర్చులు పెట్టుబడులు తప్పకపోవచ్చు. సంతాన వర్గం కోసం ఆలోచించాలి. విశ్రాంతి లోపం. నిరాశ. శుక్రవారం మాట తీరు వల్ల గుర్తింపు, గౌరవం. కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. ఖర్చులున్నా సంతోషం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. పనుల్లో పోటీలు, ఇబ్బందులు, ఒత్తిడులు తప్పకపోవచ్చు. విజయం సాధిస్తారు. కుటుంబంలో ఒత్తిడులుంటాయి. సోమవారం భాగస్వామ్యాల్లో చికాకులు తప్పకపోవచ్చు. లాభాలు సంతోషాన్నిస్తాయి. సంప్రదింపులకు అనుకూలం. పెద్దల ఆశీస్సులు. మంగళవారం వ్యర్థమైన ఖర్చులుంటాయి. పరామర్శలకు అవకాశం. పరిచయాలు, స్నేహానుబంధాల్లో కొంత జాగ్రత్త. బుధవారం వ్యాపార లాభాలుంటాయి. లక్ష్యాలను సాధిస్తారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. లాభాలు. గురువారం అనుకోని ఇబ్బందులు. అనారోగ్య భావనలుంటాయి. నిర్ణయ లోపాలు శ్రమకు గురి చేస్తాయి. జాగ్రత్త. శుక్రవారం వృత్తి ఉద్యోగాదుల్లో కొంత అనుకూలత. ఊహించని ఇబ్బందులున్నా శ్రమతో ఫలితాలు సాధించవచ్చు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త బాధ్యతల స్వీకారం. అసంతృప్తి. కార్యనిర్వహణలో జాగ్రత్త అవసరం. సోమవారం కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాట్లాడే తీరులో జాగ్రత్త అవసరం. కార్యక్రమాల నిర్వహణలో బిజీ. మంగళవారం భాగస్వామ్యాల్లో జాగ్రత్త. పరిచయాలు, అనుబంధాలు ఇబ్బంది పెడతాయి. కుటుంబ ఒత్తిడులుంటాయి. బుధవారం వ్యాపార వ్యవహారాల్లో వ్యతిరేకతలుంటాయి. పోటీల్లో కొంత జాగ్రత్త అవసరం. మాటల వల్ల ఇబ్బందులు. గురువారం సంప్రదింపులుంటాయి. కొన్ని వార్తల వల్ల ఇబ్బందులు, చికాకులు తప్పవు. ప్రయాణాదుల్లో జాగ్రత్త. శుక్రవారం అభీష్టాలు నెరవేరుతాయి. అన్ని పనుల్లో అనుకూలత. సంతానవర్గ సంతోషం. కొత్త పనుల ప్రణాళికలు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం లక్ష్యాలను సాధించే యత్నం. ఉన్నత వ్యవహారాలుంటాయి. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. బాధ్యతలు అధికం. కుటుంబంలో సంతోషం. బుధవారం నిల్వధనం పెంచుకుంటారు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఖర్చులు పెట్టుబడులుంటాయి. గుర్తింపు. గురువారం లాభాలు సంతోషాన్నిస్తాయి. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. శుక్రవారం నిర్ణయాదుల్లో అనుకూలత. నూతన కార్యక్రమాలపై దృష్టి. సంతోషంగా గడుపుతారు. ప్రయోజనాలుంటాయి. శనివారం మాటల్లో అధికారిక ధోరణి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం ఆలోచనలు ప్రభావితం చేస్తాయి. సంతానవర్గంతో జాగ్రత్తగా మెలగాలి. నూతన నిర్ణయాదులున్నా కొంత ఒత్తిడి ఉండే అవకాశం. తొందరపాటు ఉంటుంది. సోమవారం వ్యతిరేకతలను అధిగమించాలి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులున్నా గుర్తింపు ఉంటుంది. శ్రమాధిక్యం. మంగళవారం లాభాలు శ్రమకు గురి చేస్తాయి. పోటీలు ఒత్తిడులు చికాకులు అధికమయ్యే అవకాశం. బుధవారం వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత. శ్రమ ఉన్నా మేలు కలుగుతుంది. సామాజిక గౌరవం. గురువారం పరిచయాలు అనుబంధాలు పెరిగే అవకాశం. ఖర్చులు తప్పకపోవచ్చు. కాలం ధనం కోల్పోయే అవకాశం. శుక్రవారం అన్ని పనుల్లోనూ అనుకూలత. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శ్రమ ఉన్నా సంతృప్తి ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. ప్రయాణావకాశాలు. విశ్రాంతిగా గడిపే ప్రయత్నం. అనుకోని ఒత్తిడులు. సమస్యలు వెంటపడే అవకాశం. జాగ్రత్త. సోమవారం నిలకడ లేని ఆలోచనలు. నిర్ణయాదుల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. ఊహలు, అపోహలకు అవకాశం. మంగళవారం అన్ని పనుల్లోనూ పోటీలకు అవకాశం. భాగస్వామ్యాల్లో జాగ్రత్త. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. బుధవారం క్రియేటివిటీతో కార్యక్రమాల నిర్వహణ. కొత్త పనులపై, సంప్రదింపులపై దృష్టి. సంతానంతో సంతోషం. గురువారం కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. మాట తీరులో నిరాశా భావనలు. భాగస్వామ్యాల్లో సమస్యలు. శుక్రవారం ఆహారాది సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. మాటల్లో చమత్కారం, ఆకర్షణ. విద్యారంగంలో ఉన్నతి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం అనుకోని ఇబ్బందులు. అన్ని పనుల్లో జాగ్రత్త. వ్యాపార లోపాలు. సౌకర్య లోపాలు. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్యాలను సాధించే విషయంలో జాగ్రత్త. సోమవారం ఉన్నత విద్యల్లో ఇబ్బందులు. దూర ప్రయాణాల్లో జాగ్రత్త. ఊహించని ఇబ్బందులు. విశ్వాసలోపాలు. మంగళవారం కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త. నిర్ణయ లోపాలు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్త. బుధవారం వ్యాపారాదుల్లో శ్రమ ఉన్నా విజయం సాధిస్తారు. లాభాల్లో అనుకూలత. ఉన్నత విద్యలపై దృష్టి. గురువారం వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాల్లో కొంత ఒత్తిడి. సహకార లోపాలు. శుక్రవారం విందులు, విహారాలు, వినోదాల కోసం ఖర్చులు అధికం. సామాజిక గౌరవం. పితృవర్గ సంతోషం.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులపై దృష్టి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి. గృహ వాహనాల విషయంలో జాగ్రత్త. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సోమవారం ప్రయాణావకాశాలు. లక్ష్యాలను సాధించే యత్నం. నిర్ణయాదుల్లో ఒత్తిడులు. కీర్తి ప్రతిష్ఠలకు అవకాశం. మంగళవారం వృత్తి ఉద్యోగాదుల్లో సమస్యలు. అభీష్టాలు నెరవేరినా శ్రమ తప్పదు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. బుధవారం వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. భాగస్వామ్యాల్లో అనుకూలత. సౌకర్యాలు సంతృప్తినిస్తాయి. గురువారం వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు కోసం ప్రయత్నం. లాభాలున్నా సంతృప్తి ఉండకపోవచ్చు. పెద్దలతో జాగ్రత్త. శుక్రవారం ఊహించని సంఘటనలు. అనుకోని ఇబ్బందులు. కొన్ని పనులు సంతృప్తినిచ్చినా అప్రమత్తంగా మెలగాలి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744