డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో అందరూ ఎవరి గదుల్లో వాళ్ళూ పడుకుని ఉన్నారు. అంత దూరంలో వున్న వరుణ్ తన గురించీ, తన బర్త్‌డే గురించి ఆలోచిస్తూ.. అప్రయత్నంగానే ఆమె కళ్ళలో నీళ్ళొచ్చేశాయి. బాక్స్‌లో నాట్యం చేస్తున్న బొమ్మని అపురూపంగా చూసింది.
***
మర్నాడు ఉదయం తొందరగా లేచి స్నానం చేసింది హరిత అంతకుముందే కొనుక్కున్న తెల్ల చుడీదార్ వేసుకుంది. వరుణ్‌కి తెలుపు రంగంటే ఇష్టం. అతనికిష్టమైనట్లు వుండడం ఆమెకిష్టం.
చుడీదార్‌కి మ్యాచ్ అయ్యే ముత్యాల సెట్, జూకాలు పెట్టుకుంది. జుట్టుకి తెల్లటి క్లిప్ పెట్టుకుని పోనీటైల్ వేసుకుంది. వరుణ్ పరిచయమయ్యాక ఆమెకి శరీరంమీద కాన్షస్‌నెస్ పెరిగింది. దాంతో ఆమె అందం మరింత మెరుగులు దిద్దుకుని చూసే వాళ్ళకి అద్భుతంగా కనిపిస్తోంది.
ఆ రోజు హరిత పుట్టిన రోజని ఆమెకిష్టమైన పాయసం, పులిహోర చేసింది సుమతి.
‘‘దేముడికి దణ్ణం పెట్టుకుని వెళ్లి నాన్నగారి కాళ్లకి నమస్కారం చేసిరా’’ చెప్పింది సుమతి ఆమెతో.
హరిత తల్లి చెప్పినట్టు చేసింది.
‘‘హ్యాపీ బర్త్‌డే బేబీ..’’ ఆమె తలమీద చెయ్యి వేసి చెప్పాడు సుదర్శనరావు.
‘‘ఈ రోజు కాలేజ్ మానెయ్యి. అమ్మవారి గుళ్ళో అర్చన, ఆంజనేయస్వామి గుళ్ళో ఆకుపూజ చేయించమని చెప్పాను. వెళ్దాం’’ అంది సుమతి.
హరిత గుండెల్లో రాయి పడిందామె మాటలకి.
‘‘అమ్మో... ఇవాళ చాలా ఇంపార్టెంట్ క్లాసులున్నాయి. నేను కాలేజ్‌కి వెళ్లాలి’’ అంటూ నోటికొచ్చిన రెండు సబ్జెక్టుల పేర్లు చెప్పింది.
‘‘అయితే కాలేజ్‌కి వెళ్లక తప్పదంటావ్?’’
‘‘అవును మమీ.. గుడికి నువ్వెళ్ళి వచ్చేయి, ప్లీజ్’’ అంది.
‘‘ఇలాగే వెళ్తావా కాలేజీకి?’’ ఆమె హరిత డ్రెస్‌నీ అలంకరణనీ చూస్తూ అంది. ఆ డ్రెస్‌లో ఆమె ఎప్పుడూ లేనంత అందంగా కనిపిస్తోంది.
‘‘ఏం?’’ అడిగింది హరిత తన డ్రెస్ వంక చూసుకుని.
‘‘వద్దు.. దిష్టి తగిలేలా వుంది. వేరే డ్రెస్ మార్చుకుని వెళ్ళు’’
హరిత ఉత్సాహం అంతా నీరుగారిపోయింది ఆమె మాటలకి.
‘‘అబ్బా.. నీదంతా చాదస్తం మమీ.. అయినా ఇపుడు డ్రెస్ మార్చుకుని వెళ్ళేంత టైమ్ లేదు’’ అంటూ ఆమెకింక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేతికందిన రెండు బుక్స్ తీసుకుని బ్యాగ్‌లో వేసుకుని బయటికి నడిచింది. హుషారుగా నడుస్తూ వెళ్లిపోతున్న కూతురిని వీధి గుమ్మందాకా వచ్చి మురిపెంగా చూసుకుంది సుమతి ఆమె చూడకుండా. తన మాట విని హరిత డ్రెస్ మార్చుకుని వెళ్తేనే ఆమె బాధపడేదేమో...
కూతురు అందంగా, ఆనందంగా వుండకూడదని కాదు ఆమె ఉద్దేశ్యం. చదువుకోవడానికి వెళ్ళే కాలేజీలో చదువు మానేసి ఆమె అందం చూసి ఏ మగాడూ ఆమె వెంట పడకూడదని. ఆ విషయం హరితకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఆమెకి అర్థం కాదు.
హరిత గేట్ దాటి బయటికి వెళ్లిపోయింది.
***
సిటీకి దూరంగా వున్న నిర్జన ప్రదేశం అది. చుట్టూ కొండలు.. దూరంగా హైవే మీద వెళ్తున్న వాహనాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రదేశం అంటే వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఎవరికీ కనబడరు.
హరిత బస్ట్ఫాకి వచ్చేసరికి వరుణ్ ఆమె కోసం అక్కడ ఎదురుచూస్తున్నాడు. ఆ రోజు హరితని కాలేజ్‌కి వెళ్లనివ్వలేదు. అటునుంచటే హోటల్‌కి తీసుకెళ్ళాడు.
హోటల్లో కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేసేక ఇద్దరూ సినిమాకెళ్ళారు. మళ్లీ మరో పెద్ద హోటల్లో లంచ్.. అతను తన పుట్టినరోజుని అంత ప్రత్యేకమైన రోజులా భావించడం ఆమెకెంతో గొప్పగా అనిపించింది. ఆ రోజంతా అతను ఆమెని పసిపాపలానే ట్రీట్ చేశాడు.
పుట్టిన దగ్గరనుంచీ ఆమెకి ప్రతి పుట్టినరోజూ ఆనందంగానే గడిచింది గానీ, ఆ రోజెందుకో చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది ఆమెకి. ఇష్టమైన డ్రెస్ కొనుక్కోవడం, పుట్టినరోజునాడు స్నేహితులతో సినిమాలూ షికార్లూ అవేమీ కొత్తకాదు ఆమెకి. కానీ వాటికి ఆ రోజు గడిపిన విధానానికీ ఏదో తేడా వుందన్న సంగతి ఆమెకి స్పష్టంగా తెలుస్తోంది.
ఆనందానికీ థ్రిల్‌కీవున్న తేడా అది. జీవితంలో మొట్టమొదటిసారిగా ఆ తేడాని రుచి చూసిన ఆమె అరమోడ్పు కళ్ళతో కృతజ్ఞత నిండిన స్వరంతో అడిగింది వరుణ్‌ని ‘‘నా పుట్టిన రోజుని ఇంత బాగా ఎప్పుడూ గడపలేదు. నా గురించి ఇంత చేస్తున్న నీకు నేనేమివ్వగలను?’’
అతడు అల్లరిగా నవ్వాడు.
‘‘నువ్వు ఇవ్వాలనుకుంటే ఏమైనా ఇవ్వచ్చు. ఫరెగ్జాంపుల్, గులాబీ రేకుల్లాంటి నీ సుకుమారమైన పెదవులతో నా పెదవులమీద రెండు నిమిషాలపాటూ నేను జీవితంలో మర్చిపోలేని అనుభూతిని బహుమతిగా ఇవ్వచ్చు.. ఇంకా చెప్పాలంటే..’’
అతడింకా ఏదో చెప్పబోతే ఆమె ‘‘చాలు.. చాలు..’’ అంటూ ఆపింది. అప్పటికే ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి.
‘‘హరితా.. ప్లీజ్ ఈ రోజు మనిద్దరి జీవితాల్లోనూ చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఒక్క ముద్దు ఇవ్వు ప్లీజ్’’.
‘‘ఏమిటీ.. ఈ హోటల్లో ఇంతమందిలోనా? అదే కనుక జరిగితే అది మన జీవితాల్లోనే కాదు.. వీళ్ళందరి జీవితాల్లో కూడా చిరస్థాయిగా గుర్తుండిపోతుంది’’ నవ్వునాపుకుంటూ అంది.
అతడు కూడా నవ్వి ‘‘ఇక్కడ కాదులే’’ అన్నాడు.
సరిగ్గా ఇరవై నిమిషాలకి వాళ్ళిద్దరూ ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చి అప్పటికి అరగంటైంది. వరుణ్‌కి అసహనం ఎక్కువైపోయింది.
‘‘నాకిచ్చిన మాట నిలబెట్టుకునేదేమైనా వుందా?’’ అన్నాడు.
హరిత మోకాళ్ళమీద తలానించి కూర్చుని వుంది. తలంటిపోసుకున్న జుట్టు గాలికెగురుతూ ఆమె ముఖంమీద పడుతూ వింత ఆనందాన్నిస్తోంది.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ