జాతీయ వార్తలు

విశ్వభారతి వర్శిటీ వీసీకి ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: విశ్వభారతి వర్శిటీ వైస్ చాన్సలర్ పదవి నుంచి సుశాంత దత్తా గుప్తాను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. ఓ సెంట్రల్ యూనివర్శిటీ విసికి ఉద్వాసన పలకడం అన్నది దేశంలో ఇదే మొదటిసారి. దత్తా గుప్తాకు ఉద్వాసన పలకాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దాన్ని రాష్టప్రతి ఆమోదించారని ఆ శాఖ అధికార ప్రతినిధి ఘన్‌శ్యామ్ గోయల్ వెల్లడించారు. ఇంతకుముందే పైళ్లను రాష్టప్రతి పరిశీలనకు పంపామని తెలిపారు. యూనివర్శిటీలో ఆర్థిక, పాలనాపరమైన అవకతవకలకు పాల్పడినట్టు దత్తా గుప్తాపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వాటిని అటార్నీ జనరల్ కూడా ధ్రువీకరించడంతో ఫైళ్లను హెచ్‌ఆర్‌డి శాఖకు రాష్టప్రతికి పంపింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకునేముందు రాష్టప్రతి పలు సందేహాలు వ్యక్తం చేశారు. వాటిపై వివరణ కూడా హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ అందించడంతో ఉద్వాసనకు మార్గం సుగమం అయింది.