జాతీయ వార్తలు

ఉపాధి హామీ పథకాన్ని పట్టించుకోని ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామీణ బీద ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరు కారుస్తున్నాయని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఏఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పిసిసి అధ్యక్షుల సమావేశానికి హాజరైన అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు జరిగేలా చూసేందుకు పోరాడుతుందని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ ఇకమీదట ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులతో సమావేశమై పార్టీ కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని ఆయన చెప్పారు. యుపిఏ ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పథకంతో పాటు ఆహార భద్రత, గిరిజనుల హక్కు తదితర పథకాలను తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా అమలు చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ఉద్యమిస్తుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు.