జాతీయ వార్తలు

టిటిఇలే నొక్కేస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: రైల్వే బెర్త్‌లు, సీట్లు కేటాయించడంలోనూ అలాగే టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి నుంచి పెద్ద ఎత్తున లంచాలు మరిగారని దీనివల్ల రైల్వేలకు తీవ్రస్థాయిలో రెవిన్యూ నష్టం వస్తోందని తాజాగా జరిగిన ఓ సర్వేలో 62 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. మరో రెండు వారాల వ్యవధిలో కొత్త రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న దృష్ట్యా ప్రస్తుత విధానంలో ఏ రకమైన మార్పు తీసుకురావాలన్న దానిపై అనేక సలహాలు ఇచ్చారు. తత్కాల్ టికెట్ల రద్దుపై 50 శాతం రిఫండ్ సహా ప్రస్తుత టికెటింగ్ విధానంలో అవసరమైన మార్పులను తీసుకురావాలని సూచించారు. వీటిలో అనేక కీలక సూచనలు ఉండడం వల్ల వాటన్నింటికి 2016-17 రైల్వే బడ్జెట్‌లో కీలక స్థానం కల్పించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా టిటిఇలు లంచాలు తీసుకోవడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఎమర్జెన్సీ కోటా కూడా దుర్వినియోగం అవుతోందని వీటన్నింటినీ తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప రైల్వేలు మెరుగైన సేవలు అందించలేవని నిర్ద్వంద్వంగా తెలిపారు. ఈ సర్వేలో దాదాపు లక్షా 50 వేల మంది పాల్గొన్నారు. విధానపరంగా, వ్యవస్థాగతంగా కీలక మార్పులు చేస్తే తప్ప రైల్వే ప్రయాణాన్ని అర్థవంతంగా మార్చడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే సేవలను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా ఆన్‌లైన్ సర్వే నిర్వహించగా లక్షా 50వేల మంది ప్రజలు పాల్గొన్నారు. అత్యవరంగా ప్రయాణం చేయాల్సి వస్తే ట్రావెల్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నట్టు 17 శాతం మంది వెల్లడించారు. తామైతే స్పెషల్ కోటా కింద టికెట్‌కు ప్రయత్నిస్తామని తొమ్మిది శాతం మంది ప్రజలు స్పష్టం చేశారు. 62 శాతం మంది ప్రజలైతే ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ద్వారా టికెట్లు పొందుతామని అన్నారు. ఇక రైల్వే కౌంటర్లకు వెళ్లి టికెట్లు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమర్జెన్సీ అలాగే విఐపి సీట్ల కేటాయింపులో పారదర్శకత ఉండాలని సర్వేలో పాల్గొన్న అనేక మంది విజ్ఞప్తి చేశారు. టికెట్ కౌంటర్ల వద్ద దళారీలను నిరోధించాలని ప్రజలు కోరారు. జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్‌లను టికెట్ కౌంటర్ల వద్ద నియమించి దళారులను అదుపుచేయాలని సూచించారు. సీనియర్ సిటిజన్స్‌కు, మహిళలకు లోయర్, మిడిల్ బెర్త్‌లే కేటాయించాలన్నారు. అలాగే ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోడానికి పరిమితి ఉండకూడదన్నారు.