జాతీయ వార్తలు

సిద్దయ్య, నాగరాజులకు రాష్టప్రతి శౌర్య పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఉగ్రవాదానికి ఎదురెళ్లి సిమి ముష్కరుల ఎదురు కాల్పుల్లో అసువులు బాసిన తెలంగాణ ఎస్‌ఐ దూదేకుల సిద్దయ్య, కానిస్టేబుల్ చౌగోని నాగరాజులకు రాష్టప్రతి శౌర్య పతాకాలు లభించాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలందించిన పోలీసులకు కేంద్రం ఏటా ప్రకటించే శౌర్య పతకాలు, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ అవార్డులు 38మందికి లభించాయి. వాటిలో రాష్టప్రతి శౌర్య పతకాలు 2, రాష్టప్రతి పోలీసు పతకాలు 24, రాష్టప్రతి విశిష్ట సేవా పతకం 1, అత్యుత్తమ సేవా పతకాలు 11 ఉన్నాయి. నిషేధిత సిమి కార్యకర్తల కుట్రను భగ్నం చేసే ప్రయత్నంలో నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో అశువులు బాసిన ఎస్‌ఐ దూదేకుల సిద్దయ్య, కానిస్టేబుల్ చౌగోని నాగరాజులకు రాష్టప్రతి శౌర్య పతకాలు ప్రకటించారు. అలాగే ఉత్తమ సేవలందించిన 24మందికి రాష్టప్రతి పోలీసు పతకాలు ప్రకటించారు. ఉత్తమ పతకాలకు ఎంపికైన వారిలో మోతుకుదురు చంద్రశేఖర్, కైత రవీందర్‌రెడ్డి, సయ్యద్ అబ్దుల్ కరీమ్, మహ్మద్ ముజీబ్, ఎండి తాజ్‌పాషా, ఎన్ రాజ్యవర్ధన్ రెడ్డి, ఎండి ముషారఫ్ బాబా, త్రిపాఠి ప్రభాకరరావు, ఎన్ అనిల్‌కుమార్, వేదాద్రి మధుసూదన్, తోడేటి శివ కోటేశ్వరరావు, ముత్తినేని శ్రీను, అన్నరెడ్డి చిన్నబాల గంగిరెడ్డి, ఎల్ జానకీరామ్, రాజేష్‌కుమార్, మాదా దయానందరెడ్డి, ఆర్వీ ఫణీందర్, వేముల భాస్కర్, గంగాని సత్యనారాయణ, సోనిలాల్ అమ్రిత్, సయ్యద్ సర్వర్ బాషా, గోల్కొండ నరేందర్, ఎండి ఖాదిర్‌లు ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా 7వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాస్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్పీ నరోత్తమ రెడ్డి, ఐదో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సత్తుపల్లి కృష్ణస్వామి, అడిషినల్ ఎస్పీ నటరాజన్ బాలాజీ, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌నుంచి మురళీ కృష్ణ, హైదరాబాద్ పాస్‌పోర్టు వెరిఫికేషన్ సెల్ ఎఎస్పీ మహ్మద్ నిజాముద్దీన్ , గద్వాల్ డిఎస్పీ ఎ బాలకోటి, సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వెంకట సత్యనారాయణ, హైదరాబాద్ ఇంటిలిజెన్స్ ఎఎస్‌ఐ వి రంగయ్య, హైదరాబాద్ క్రైం ఇన్విస్టిగేషన్ ఎఎస్‌ఐ వి పాండురంగారావు, ఒకటో బెటాలియన్ కానిస్టేబుల్ అబ్దుల్ నరుూం, హైదరాబాద్ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ బాలకృష్ణలకు అత్యుత్తమ సేవా పతకాలు లభించాయి. ఫైర్ సర్వీస్ డిజి రాజీవ్ రతన్‌కు రాష్టప్రతి విశిష్ట పురస్కారం లభించింది. అదేవిధంగా ఫైర్ సర్వీస్‌లో సేవలు అందించిన బొల్లికొండ మల్లయ్య, వాల్దేస్ ఈదయ్య, కె శంకరయ్యలకు విశిష్ట పతకాలు దక్కాయి. ఆగస్టు 15 సందర్భంగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా వీరంతా పతకాలు అందుకోనున్నారు.

చిత్రం... జానకీపురం ఎదురు కాల్పుల్లో అసువులు బాసిన ఎస్‌ఐ సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజు