క్రీడాభూమి

టైటిల్‌పై భారత్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఫ్గానిస్థాన్‌తో శాఫ్ కప్ ఫైనల్ నేడు

తిరువనంతపురం, జనవరి 2: ఆసియాలోనే అత్యంత పటిష్టమైన అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగే దక్షిణ ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) కప్ ఫైనల్ కోసం సునీల్ చత్రీ నాయకత్వంలోని భారత జట్టు సిద్ధమైంది. టైటిల్‌పై కనే్నసి, సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రణాళికలను రూపొందించుకుంది. ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొని విఫలమైన భారత జట్టు శాఫ్ టైటిల్‌తోనైనా సంతృప్తి చెందాలని అనుకుంటున్నది. 2011లో న్యూఢిల్లీలో జరిగిన శాఫ్ కప్ ఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌ను 4-0 తేడాతో చిత్తుచేసిన భారత్ టైటిల్ అందుకుంది. సునీల్ చత్రీ రెండు గోల్స్ చేసి, ఆ మ్యాచ్‌లో భారత్‌కు విజయాన్ని సాధించిపెట్టాడు. కాగా, రెండేళ్ల క్రితం జరిగిన శాఫ్ కప్‌లో తిరిగి భారత్, అఫ్గానిస్థాన్ జట్లు ఫైనల్ చేరాయి. అయితే డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయింది. అఫ్గానిస్థాన్ 2-0 తేడాతో గెలుపొంది, అంతకు ముందు తనకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఆసియాలో బలమైన జట్టుగా నిలబడడమేగాక, గత శాఫ్ కప్‌లో ఎదురైన పరాజయానికి సరైన సమాధానం చెప్పడమే స్టెఫెన్ కాన్‌స్టాంటిన్ కోచ్‌గా వ్యవహరిస్తున్న భారత్ లక్ష్యంగా ఎంచుకుంది. కెప్టెన్ సునీల్ చత్రితోపాటు జేజె లల్పెక్లువా, అర్నాబ్ మోండల్, సుబ్రతా పాల్, రాబిన్ సింగ్ వంటి మేటి ఆటగాళ్ల అండ భారత జట్టుకు ఉంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో, కీలకమైన దశల్లో దాడులకు ఉపక్రమించి గోల్స్ సాధించడంలో వీరు సమర్థులు. అఫ్గానిస్థాన్‌ను తక్కువ అంచనా వేయలేకపోయినా, భారత ఆటగాళ్ల ప్రతిభను శంకించడానికి వీల్లేదు. ఈ టోర్నమెంట్ గ్రూప్ దశ నుంచి మొదలుపెడితే సెమీస్ వరకూ అఫ్గానిస్థాన్ తనకు ఎదురైన ప్రతి జట్టునూ ఓడిస్తూ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. భారత్ కూడా అత్యద్భుత ప్రతిభను కనబరుస్తూ టైటిల్ సాధించే సత్తా తనకు ఉందని సంకేతాలు పంపింది. రాబిన్ సింగ్ ఫిట్నెస్ ఒక్కటే ప్రస్తుతం భారత జట్టును వేధిస్తున్న ప్రధాన సమస్య. ఫైనల్‌లో అతను బరిలోకి దిగుతాడో లేదో చెప్పలేని పరిస్థితి. మిగతా వారంతా ఫిట్నెస్‌తోనే ఉన్నారని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. నాలుగు మ్యాచ్‌ల్లో 16 గోల్స్ సాధించడమే భారత జట్టు ప్రతిభకు నిదర్శనమని, కాబట్టి ఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌ను అడ్డుకునే అవకాశాలు కూడా ఆ జట్టుకు ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే, అఫ్గాన్‌ను ఓడించడం అసాధ్యం కాకపోయినా, అనుకున్నంత సులభం మాత్రం కాదని ఇప్పటికే ఆ జట్టు పాల్గొన్న మ్యాచ్‌లు మనకు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద ఇరు జట్లు హోరాహోరీకి సిద్ధం కావడంతో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తిని రేపుతోంది. (చిత్రం) భారత ఆటగాళ్ల ముమ్మర ప్రాక్టీస్