క్రీడాభూమి

సింధు టైటిల్ వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మకావూ ఫైనల్‌లో నేడు మితానీతో ఢీ
మకావూ, నవంబర్ 28: భారత సాటర్ షట్లర్, తెలుగు తేజం పివి సింధు ఇక్కడ జరుగుతున్న మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ టెన్నిస్ టోర్నమెంట్‌లో టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న ఆమె సెమీ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన అకానే యమాగుచీని 21-8, 15-21, 21-16 తేడాతో ఓడించి ఫైనల్‌లో స్థానం సంపాదించింది. తొలి సెట్‌ను సులభంగా గెల్చుకున్న సింధుకు రెండో సెట్‌లో అకానే నుంచి తీవ్ర స్థాయిలో పోటీ ఎదురైంది. ఫలితంగా ఆ సెట్‌ను చేజార్చుకుంది. మూడో సెట్ కూడా చాలా సేపు హోరాహోరీగా సాగింది. అయితే, చివరిలో సింధు పైచేయి సాధించి, సెట్‌తోపాటు మ్యాచ్‌ని కూడా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె ఆరో సీడ్ మినాత్సు మితానీతో టైటిల్ పోరును కొనసాగిస్తుంది. మరో సెమీ ఫైనల్‌లో మితానీ 17-21, 21-12, 21-12 ఆధిక్యంతో హె బింగియావో (చైనా)పై విజయం సాధించింది. కాగా పురుషుల సింగిల్స్‌లో జియాన్ హియాక్ జుయ్, తియాన్ హౌవెయ్ ఫైనల్‌లో పోరాడతారు. జయ్ 21-15, 21-15 తేడాతో గొసున్ హుయాత్‌ను, హౌవెయ్ 21-18, 21-17 స్కోరుతో ఇషాన్ వౌలానా ముస్త్ఫొను ఓడించి టైటిల్ పోరును ఖాయం చేసుకున్నారు. (చిత్రం) మకావూ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ ఫైనల్ చేరిన పివి సింధు