క్రీడాభూమి

మూడో రౌండ్‌కు సింధు, శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోనేషియా మాస్టర్స్ బాడ్మింటన్
=======================
మలాంగ్, డిసెంబర్ 3: టాప్ సీడ్స్ పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో మూడో రౌండ్ చేరారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో సింధు 21-12, 21-9 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఉలాన్ కాహ్య ఉతామీ సుకుపుత్రిని ఓడించింది. రెండు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలను కైవసం చేసుకున్న సింధు ఈ మ్యాచ్ ఆరంభం నుంచే అద్వితీయ ప్రతిభ కనబరచింది. తర్వాతి మ్యాచ్‌లో ఆమె చైనాకు చెందిన హి బిజియావోతో తలపడుతుంది. మరో మ్యాచ్‌లో బిజియావో 21-19, 21-15 ఆధిక్యంతో జాంగ్ మి లీపై గెలిచింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ ఆటగాడు శ్రీకాంత్ 21-14, 17-21, 25-23 తేడాతో సుపుత్ర వికీ అంగాపై గెలుపొందాడు. ఎనిమిదో సీడ్ ఆర్‌ఎంవి గురుసాయిదత్ కూడా మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. అతను రెండో రౌండ్‌లో సింగపూర్ ఆటగాడు కియెన్ యూ లోను 21-19, 19-21, 21-15 స్కోరుతో ఓడించాడు. ఇలావుంటే, ప్రణయ్ రెండో రౌండ్‌లో పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించాడు. అతనిపై షియూకీ (చైనా) 21-12, 20-22, 21-13 తేడాతో గెలిచాడు.