జాతీయ వార్తలు

రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ ఆవిర్భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* టిఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి
* కింజరాపు వ్యాఖ్యలపై స్పందన
న్యూఢిల్లీ, నవంబర్ 26: రాజ్యాంగబద్ధమైన ప్రక్రియతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు జితేందర్‌రెడ్డి లోక్‌సభలో స్పష్టం చేశారు. యుపీఏ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించిందని టిడిపి ఎంపీ కింజరాపురామ్మోహన్‌నాయుడు సభలో చేసిన వ్యాఖ్యలపై జితేందర్‌రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే తీరులోవ్యాఖ్యలు చేయడం సరైందికాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ తెలుగుదేశం అధ్యక్షుని హోదాలో చంద్రబాబు రాసిన లేఖను రామ్మోహన్ నాయుడు తండ్రి దివంగత ఎర్రంనాయుడు స్వయంగా ప్రణబ్ ముఖర్జీకి అందచేశారని ఆయన గుర్తుచేశారు. ఈ వాస్తవాన్ని రామ్మోహన్‌నాయుడు మరచిపోయినా చరిత్ర విస్మరించదని జితేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నేరవేరిందని చెబుతూ, రెండు రాష్ట్రాల ప్రజలు ప్రజలు సుఖంగా ఉంటూ అభివృద్ధి సాధించాలని టిఆర్‌ఎస్ కోరుకుంటున్నట్టు ఎంపీ వెల్లడించారు.

కొడకండ్లలో గిరిజన బాలికలకు ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయండి
న్యూడిల్లీ, నవంబర్ 26: వరంగల్ జిల్లా కొడకండ్ల మండలంలోఏకలవ్య బాలికల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయవలసిందిగా రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి జువోల్ వోరమ్‌కు విజ్ఞప్తిచేశారు. గిరిజన జనాభా అధికంగా ఉన్న ఈ మండంలో ఆడపిల్లలు చదువుకోవటానికి వీలుగా ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయవలసిందిగా ఆయన కోరారు.