జాతీయ వార్తలు

గవర్నర్ ఆచార్యను తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్సాం సిఎం గొగోయ్ డిమాండ్
గౌహతి, నవంబర్ 23: అస్సాం గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్యను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ డిమాండ్ చేశారు. హిందుస్థాన్ కేవలం హిందువులదేనంటూ ఆచార్య చేసిన ప్రకటన, దేశంలోని ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్లిపోవచ్చంటూ ఆ తర్వాత ఆయన ఇచ్చిన వివరణ ఆచార్యతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద వైఖరిని బట్టబయలు చేస్తున్నాయని గొగోయ్ అన్నారు. సోమవారం తరుణ్ గొగోయ్ గౌహతిలో విలేఖర్లతో మాట్లాడుతూ, ‘గవర్నర్ పదవి ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఆ పదవికి గల గౌరవాన్ని ఎలా నిలబెట్టాలో బాలకృష్ణ ఆచార్యకు తెలియదు. ఇటువంటి వ్యక్తులను గవర్నర్లుగా నియమించడం, వారు చేస్తున్న మతోన్మాద ప్రకటనలు దేశ సమైక్యతను దెబ్బతీస్తాయి’ అంటూ ధ్వజమెత్తారు.