జాతీయ వార్తలు

జయ ఆస్తుల కేసుపై రోజువారీ విచారణ: సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలితతో పాటు మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై రోజువారీ విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు సోమవారం అంగీకరించింది. జస్టిస్ పిసి.ఘోష్, జస్టిస్ ఆర్‌కె.అగర్వాల్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ ఏడాది జులైలోనే ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించినప్పటికీ కర్నాటక హైకోర్టు తీర్పుపై స్టే విధించలేదు. ఈ కేసుకు సంబంధించిన అంశాల జాబితాను సమర్పించాలని, అవి అందిన తర్వాత సదరు పిటిషన్లపై రోజువారీ విచారణ జరిపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం ఇరు పక్షాలకు స్పష్టం చేసింది.