జాతీయ వార్తలు

వివాహం రద్దు కాకపోయినా స్ర్తిధనాన్ని తిరిగి అడగొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీం కోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ, నవంబర్ 22: వివాహం చట్టబద్ధంగా రద్దు కాకపోయినప్పటికీ వివాహ సమయంలో ఇచ్చిన ‘స్ర్తిధనాన్ని’ తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరే హక్కు మహిళకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహ సమయంలో, వివాహంలో భాగంగా అంతకుముందు, తొలి సంతానం సందర్భంగా.. ఇలా ఎప్పుడు ఇచ్చిన స్ర్తిధనాన్ని అయినా తన భర్త నుంచి, అతని తల్లిదండ్రుల నుంచి తిరిగి తీసుకునే హక్కు మహిళకు ఉంటుందని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ప్రఫుల్ల సి పంత్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. ‘జుడీషియల్ సెపరేషన్’ (విడాకులు మంజూరు కాకపోయినా కోర్టు ఆదేశాల మేరకు విడివిడిగా నివసిస్తుండటం), ‘డిక్రీ ఆఫ్ డైవర్స్’ (న్యాయస్థానం ద్వారా చట్టబద్ధంగా విడాకులు పొందడం)కు మధ్య తేడా ఉందని పేర్కొన్న ధర్మాసనం, ఒక మహిళకు తన స్ర్తిధనాన్ని తిరిగి ఇవ్వాలని భర్త, అతని కుటుంబ సభ్యులను అడిగే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. స్ర్తిధనం స్థిరాస్తి అయినా కావొచ్చు లేదా చరాస్తి అయినా కావొచ్చని తెలిపింది. ‘్భర్త లేదా అతని కుటుంబ సభ్యులు ఎవరైనా స్ర్తిధనాన్ని తమ వద్ద ఉంచుకోవడం ద్వారా నేరానికి పాల్పడుతున్నారా లేదా? అనేది మనం చూడాల్సి ఉంటుంది. అయితే తన స్ర్తిధనాన్ని తిరిగి తీసుకోవడానికి కోర్టులో కేసు వేసే హక్కు భార్యకు ఉంటుందనేది నిర్వివాదాంశం’ అని ధర్మాసనం వివరించింది. బాధితురాలయిన భార్య తన భర్త వద్ద ఉన్నంత కాలం స్ర్తిధనం కూడా భర్త నియంత్రణలోనే ఉంటుందనే అభిప్రాయానికి మనం ప్రచారం కల్పించకూడదని, 2005లో గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పిస్తూ తెచ్చిన చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం మహిళ తన స్ర్తిధనాన్ని తిరిగి ఇవ్వాలని కోరగలుగుతుందని దర్మాసనం తీర్పులో వెల్లడించింది. ఒక మహిళ దాఖలు చేసిన అప్పీలును విచారించిన సుప్రీంకోర్టు.. గతంలో ట్రయల్ కోర్టు, త్రిపుర హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. భర్తనుంచి విడిపోయిన తరువాత భార్యకు తన స్ర్తిధనాన్ని తిరిగి ఇవ్వాలని కోరే హక్కు లేదని ఈ రెండు కోర్టులు గతంలో తీర్పులు ఇచ్చాయి.