జాతీయ వార్తలు

త్వరగా తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యుత్ ఉద్యోగుల వివాదంపై హైకోర్టుకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: రాష్ట్ర విభజన జరిగినప్పుడు విద్యుత్ ఉద్యోగుల కేటాయింపులో తలెత్తిన వివాదం కారణంగా ఎటూకాకుండా పోయిన 1,156 మంది ఉద్యోగులకు సంబంధించిన కేసుపై తక్షణమే రోజువారీ విచారణ నిర్వహించి సమస్యను పరిష్కరించవలసిందిగా సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది. ఈ 1,156 మంది తమ వారు కాదని వాదిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పంపించివేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... వీరు ఆంధ్రకు చెందిన వారు కానందున 58-42 నిష్పత్తిలో వేతనాలు చెల్లించటం తమకు సాధ్యపడదన్న వాదనతో వీరిని తీసుకోవటానికి నిరాకరించింది. రెండు రాష్ట్రాలు తమకు ఉపాధి కల్పించకపోవటంతో జీతాలు లేక నానా ఇబ్బందులకు గురి అవుతున్నామంటూ ఈ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాము హైకోర్టులో పిటీషన్ వేశామని, విచారణ వేగంగా జరగనందున తమకు న్యాయం చేయవలసిందిగా సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ ఇక్బాల్, జస్టిస్ నాగప్పన్‌తో కూడిన బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి తక్షణమే రోజువారీ విచారణను చేపట్టి సాధ్యమైనంత త్వరగా వివాదాన్ని పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది.