జాతీయ వార్తలు

ఎన్నికల సంస్కరణలపై విచారణకు ‘సుప్రీం’ అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశ రాజకీయాల్లో నేరస్థులకు, మతోన్మాదానికి తావు లేకుండా నిబంధనలను రూపొందించి ఎన్నికలను సంస్కరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు సోమవారం అంగీకరించింది. ఈ పిటిషన్‌ను ఇదేవిధమైన మరో పిటిషన్‌తో జతచేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఇదేవిధమైన మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం పెండింగ్‌లో ఉందని, కనుక ఈ రెండు పిటిషన్లను కలిపి విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్.దత్తు, జస్టిస్ అమితావ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయకుండా, రాజకీయ పార్టీల్లో ఆఫీస్ బేరర్ల అవతారమెత్తకుండా నిరోధించేందుకు వారిపై జీవితకాల నిషేధం విధించాలని విజ్ఞప్తి చేస్తూ అశ్విన్ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అవినీతి, నేరాలు, కులతత్వం, మతోన్మాదం, ఆశ్రీత పక్షపాతంతో కునారిల్లుతున్న ఎన్నికల వ్యవస్థను సంస్కరించి సామ్యవాదం, లౌకికతత్వం, ప్రజాస్వామ్యం పట్ల పౌరుల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని ఆయన కోరారు. తీవ్రమైన అవినీతి, క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులపై కేవలం ఆరేళ్ల నిషేధంతో ఎందుకు సరిపుచ్చుతున్నారు. ఇటువంటి వ్యక్తులపై జీవితకాల నిషేధం ఎందుకు విధించకూడదు? అని అశ్విన్ ప్రశ్నించారు.