జాతీయ వార్తలు
పత్తికి మద్దతు ధరను ప్రధానే నిర్ణయిస్తారు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
* కేంద్ర జౌళి మంత్రి
న్యూఢిల్లీ, నవంబర్ 23: పత్తిపంటకు కనీస ధర నాలుగు వేల నుంచి ఐదువేల రూపాయలకు పెంచాలన్న రైతుల డిమాండ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తుది నిర్ణయం తీసుకుంటారని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ స్పష్టం చేశారు. ఈ విషయాలపై వాణిజ్యం, ఆర్థిక, జౌళి శాఖల మంత్రుల కమిటీ సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలోని పత్తిరైతులు పడుతున్న ఇబ్బందులపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం గంగ్వార్‌తో చర్చించారు. కనీస మద్దతు ధర పెంపుతో పాటు తేమ శాతం 24 ఉన్నప్పటికీ సరుకును కొనుగోలు చేయాలన్న రైతుల డిమాండ్‌పై కూడా మంత్రి వర్గం ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని గంగ్వార్ తెలిపారు.
రైతులు పండించిన పత్తిని ఏ విధంగా మార్కెట్‌కు తీసుకువచ్చినా కొనుగోలు చేయవలసిందిగా కాటన్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. రైతులు ఒకే సారి 40 క్వింటాళ్లు తీసుకువచ్చినా కొనుగోలుచేస్తారని ఆయన అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తరువాత రోజువారీ పరిస్థితిని సమీక్షించి రైతాంగాన్ని ఆదుకుంటామని గంగ్వార్ స్పష్టం చేశారు.