జాతీయ వార్తలు

ఐఐటీ గువహటిలో జపనీస్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువహటి: ఐఐటీ గువహటిలో జపనీస్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ప్రాజెక్టు వర్క్ నిమిత్తం మూడు నెలల క్రితం వచ్చాడు. ఈనెల 30తో ప్రాజెక్టు వర్క్ పూర్తవుతుంది. ఇంతలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. క్యాంపస్‌లోని ఓ హాస్టల్‌లోనే మూడు నెలల నుంచి జపనీస్ విద్యార్థి ఉంటున్నాడు. అయితే నిన్న మధ్యాహ్నం అతను ఉంటున్న రూమ్ మూసి ఉంది. దీంతో అనుమానం వచ్చి పోలీసులు గది తలుపులు పగులగొట్టారు. బాత్‌రూంలోని వెంటిలేటర్‌కు ఉరేసుకున్నాడు విద్యార్థి. విద్యార్థి ఆత్మహత్యపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఐఐటీ గువహటి అధికారులు సమాచారం అందించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.