జాతీయ వార్తలు

కీలక బిల్లులు ఆమోదం పొందుతాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిపక్షాల మద్దతుపై అధికారపక్షం ఆశాభావం పార్లమెంటులో వ్యూహంపై సీనియర్ మంత్రుల చర్చ

న్యూఢిల్లీ, నవంబర్ 24: పార్లమెంటు శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై పలువురు కేంద్రమంత్రులు ఇక్కడ సమావేశమై చర్చించారు. కాగా, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) సహా సంస్కరణలకు సంబంధించిన కీలక బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ సహకరిస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది. ఈ రోజు సమావేశమైన మంత్రుల్లో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఉన్నారు. ప్రతిపక్షాల సహకారాన్ని తీసుకుని ప్రధాన బిల్లులకు ఆమోదం పొందడానికి వీలుగా ఉభయ సభలు సాఫీగా నడిచేలా చూడడం అనేది ప్రభుత్వ అజెండాగా ఉంటుందని ఈ సమావేశానికి హాజరయిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్, జైట్లీ, వెంకయ్యనాయుడులాంటి సీనియర్ మంత్రులు వివిధ ప్రతిపక్షాల నేతలతో మాట్లాడారని, వారి సహకారాన్ని కోరారని చెప్పారు. జాతీయ ప్రయోజనాలకు ఎంతో ముఖ్యమైన కీలక సంస్కరణ బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ మద్దతు లభిస్తుందని తాము ఆశిస్తున్నట్లు నఖ్వీ తెలిపారు. కొన్ని ఆర్థికపరమైన బిల్లులతోసహా మొత్తం 38 బిల్లులు పార్లమెంటు ఆమోదంకోసం ఎదురు చూస్తున్నాయని, అత్యంత కీలకమైన జిఎస్‌టి బిల్లు కూడా పార్లమెంటులో పెండింగ్‌లో ఉందని, వచ్చే సమావేశాల్లో ఇది ఆమోదం పొందుతుందని ప్రభుత్వం ఆశిస్తోందని చెప్పారు. ప్రభుత్వం బుధవారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ప్రధాని నివాసంలో బిజెపి పార్లమెంటరీ పార్టీ కార్యకర్గం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగుతుంది. అనంతరం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం జరుగుతుంది.