జాతీయ వార్తలు

నరుూం ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 8: మాజీ మావోయిస్టు నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి పోలీస్ వ్యవస్థకు సవాల్‌గా మారిన నరహంతకుడు నరుూం ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. గ్యాంగ్‌స్టర్‌గా సెటిల్‌మెంట్లు, భూదందాలకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిని కిరాతకంగా మట్టుబెట్టి కోట్ల రూపాయల దందా నడిపస్తున్న నరుూం (50) సోమవారం ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని మిలీనియం టౌన్‌షిప్‌లో పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. నరుూం షాద్‌నగర్ టౌన్‌షిప్‌లో ఉన్నట్టు పక్కా సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ దళాలు, కేంద్ర బలగాలు చాకచక్యంగా చుట్టుముట్టి నరుూంను ప్రాణాలతో పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే (ఎపి 28 డిఆర్ 5859) కారులో వెళ్తున్న నరుూం పోలీసులు వెంబడిస్తున్న విషయాన్ని గమనించి తనదగ్గరున్న ఎకె-47తో పోలీసులపైకి కాల్పులకు దిగాడు. ఇరుపక్కల కాల్పులు జరగడంతో, నరుూం కారు డ్రైవర్ కారును ఆపేసి పరారయ్యాడు. నరుూం తప్పించుకోవడానికి పోలీసులపై కాల్పులు జరుపుతూ కారులో నుంచి పరుగుతీశాడు. గ్రేహౌండ్స్ దళాలు, కేంద్ర బలగాలు ఒక్కసారిగా నరుూంపై దాదాపు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో నరుూం అక్కడిక్కకడే కుప్పకూలిపోయాడు. కాగా నరుూం గత కొన్ని నెలలుగా అడ్డా చేసుకున్న ఇంట్లో మరికొందరు ఉంటున్నారు. కాల్పుల శబ్దాలు విని పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీస్ బలగాలు వారిని వెంబడించి పట్టుకున్నాయి. దాదాపు నరుూం ముఠాకు సంబంధించిన 12మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఐదుగురు మహిళలు సహా 12మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నరుూంను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు, మిగితా వారిని అదుపులోకి తీసుకున్న వెంటనే ప్రత్యేక వాహనాల్లో రహాస్యంగా హైదరాబాద్‌కు తరలించారు. ఉదయం 7గంటలకు నరుూంను పోలీసులు కాల్చిచంపగా, తొమ్మిది గంటల వరకు జిల్లా అధికారులకు సమాచారం లేదు. తరువాత ప్రచార సాధనాల ద్వారా తెలుసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌కు చేరుకుంది. అక్కడికి చేరుకున్న మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ప్రత్యేక బలగాలు లోపలికి అనుమతించలేదు. దాదాపు 12 గంటల తరువాత జిల్లాకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం సహాయం తీసుకున్న గ్రేహౌండ్స్ దళాలు, అప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులను ఆపరేషన్ జరిగిన స్థలానికి కొంతదూరం వరకు అనుమతించారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుంటూరు జిల్లాకు చెందిన బాషా అనే వ్యక్తి నరుూంకు మంచి అనుచరుడు. బాషా దాదాపు ఏడాదిన్నరపాటు షాద్‌నగర్‌లోనే మకాం వేశాడు. నరుూం తన కార్యక్రమాలను ఇక్కడి నుంచే సజావుగా కొనసాగిస్తున్నాడు. నరుూం కారులో మరో రైఫిల్ సైతం లభించింది. సంఘటన స్థలంలో దాదాపు 20 నుండి 30 వరకు బుల్లెట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నరుూం వెళ్తున్న కారుకు డ్రైవరు పక్కనున్న డోరు అద్దాలు పగిలిపోయాయి. నరుూం కారునుంచే పోలీసులపైకి కాల్పులు జరిపి ఉండొచ్చని భావిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను కూడా నరుూం ఇటీవల బెదిరించి దాదాపు సెటిల్‌మెంట్ల వ్యవహారంలో 10 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ఉగ్రవాద సంస్థలతోనూ నరుూంకు సంబంధాలు ఉన్నట్టు కేంద్ర బలగాలకు పక్కా సమాచారం అందడంతో నిఘా పెట్టారు. ఎట్టకేలకు కేంద్ర బలగాల సాయంతో గ్రేహోండ్స్ దళాలు షాద్‌నగర్‌లో నరుూంను మట్టుపెట్టాయి.

చిత్రాలు.. హతుడు నయాం (ఫైల్ ఫొటో)

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నయాం