జాతీయ వార్తలు

ఖాదీ వృద్ధితో ఉపాధి సమృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: దైనందిన జీవితా ల్లో చేనేత ఉత్పత్తులనే ఎక్కువగా వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చేనేత రంగం ఎంతగా అభివృద్ధి చెందితే అంతగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అలాగే మహిళల సాధికారికతకూ ఈ రంగం ఎంతగానో ఊతాన్నిస్తుందని తెలిపారు. చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం వివిధ ట్వీట్లు చేసిన మోదీ ఈ రంగం ప్రాధాన్యతను, దాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. చేనేత రంగం వైవిధ్య భరితమైనదని, పర్యావరణానికి దోహదం చేసేదేనని తెలిపారు. ఇలాంటి రంగానికి చెందిన ఉత్పత్తులను విరివిగా వినియోగించడం వల్ల ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయని చెప్పారు. ముఖ్యం గా ఇది మహిళలు అత్యధిక సంఖ్యలో పనిచేసే రంగం కాబట్టి ఇది ఎంతగా అభివృద్ధి చెందితే మహిళల ఆదాయం పెరిగి వారిలో ఆర్థిక స్వావలంబన, సాధికారికత ఇనుమడిస్తుందని తెలిపారు. ‘చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ఉత్పత్తులనే దైనందిన జీవితాల్లో వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం’అని పిలుపునిచ్చారు. ‘దేశం కోసం ఖాదీ, ఫ్యాషన్ కోసం ఖాదీ’అని శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్న మోదీ 125కోట్ల మంది భారతీయులు తమ వస్త్ర అవసరాలను ఐదు శాతం మేర ఖాదీతో తీర్చుకుంటే ఈ రంగం దివ్యంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. దేశంలో ఖాదీ పరిశ్రమ ప్రాధాన్యతను, దేశ ఆర్థిక అభివృద్ధిలో దాని పాత్రపై ప్రజల్లో చైతన్యం కలిగించే ఉద్దేశంతోనే ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవం ద్వారా చేనేత కార్మికుల ఆదాయాన్ని పెంచడంతో పాటు, ఈ రంగంలో ఉన్నందుతు వారు గర్వపడేలా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. ఆగస్టు ఏడో తేదీకి దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలోనూ విశేష ప్రాధాన్యత ఉంది. 1905లో ఇదే రోజున కోల్‌కతాలోని టౌన్‌హాలులో స్వదేశీ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఆ ఉద్యమంతోనే దేశీయ ఉత్పత్తులే వాడాలని, వీటిని ఉత్పత్తుల్ని విస్తృతం చేయాలన్న చైతన్యం ప్రజల్లో బలపడింది. అనంతరం అది మహోద్యమంగా..అంతిమంగా ఆంగ్ల పాలకులు పలాయనం చిత్తగించేలా జన చైతన్యానికీ ఊతాన్నిచ్చింది.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో చేనేత కార్మికుడికి సంత్ కబీర్ అవార్డు అందిస్తున్న కేంద్ర జౌళిమంత్రి స్మృతి ఇరానీ