జాతీయ వార్తలు

సగటున రోజుకు నలుగురి రేప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశ రాజధాని ఢిల్లీలో 2012-2015 మధ్య కాలంలో సగటున రోజుకు నలుగురు మహిళలు అత్యాచారానికి గురయ్యారు. మరో తొమ్మిది మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఢిల్లీ పోలీసులు ఈ నాలుగేళ్లలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి పొందుపరచిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ నాలుగేళ్లలో మహిళలపై అత్యాచారాల కేసులు మూడింతలు పెరిగాయి. 2012లో 706 రేప్ కేసులు నమోదు కాగా, 2015లో 2199 కేసులు నమోదయ్యాయి. 2013లో 1636 రేప్ కేసులు నమోదు కాగా, ఆ తరువాత సంవత్సరంలో 2166 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో గత 15 ఏళ్లలో మహిళలపై మానభంగాల కేసులు సుమారు ఆరింతలు పెరిగాయి. 2001లో 381 రేప్ కేసులు నమోదు కాగా, 2015లో ఈ కేసుల సంఖ్య 2199కి పెరిగింది.
మహిళలపై లైంగిక దాడుల కేసులు 2012లో 727 నమోదు కాగా, 2013లో ఈ కేసుల సంఖ్య 3515కు, 2014లో 4322కు, 2015లో 5367కు పెరిగింది. 2015లో జనవరి నుంచి జూలై నెల మధ్య నాటికి 1120 రేప్ కేసులు నమోదు కాగా, 2016 జూలై మధ్య నాటికి 66 శాతం పెరుగుదలతో 1186 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మహిళలకు వారి ఇళ్లలోనూ భద్రత లేదనే విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడించాయి. భర్త, అత్తమామల నుంచి వరకట్న వేధింపులతో పాటు హింసకు గురికావడం వంటి కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. 2012 నుంచి 2016 జూలై మధ్య కాలం వరకు 681 వరకట్న సంబంధిత మరణాలు జరిగాయి. ఈ నాలుగేళ్లలో మహిళలు తమ భర్తలు, అత్తమామలపై పెట్టిన కేసుల సంఖ్య 13,984. ఇలాంటి కేసులు నిలకడగా పెరుగుతున్నాయి. 2012లో ఇలాంటి కేసులు 2046 నమోదయ్యాయి. 2013లో ఈ కేసుల సంఖ్య 3045కు, 2014లో 3194కు, 2015లో 3536కు పెరిగింది.
2015 జనవరి నుంచి జూలై మధ్య వరకు 1842 కేసులు నమోదయ్యాయి. 2016 జనవరి నుంచి జూలై మధ్య వరకు ఈ కేసుల సంఖ్య 2163కు పెరిగింది. ఈ నాలుగేళ్లలో మొత్తం 681 వరకట్న మరణాలు సంభవించాయి. వీటిలో 2012లో 134, 2013లో 144 జరిగాయి. ఈ సంఖ్య 2014లో 153కు పెరగగా, తరువాత సంవత్సరంలో మాత్రం 122కు స్వల్పంగా తగ్గింది.