జాతీయ వార్తలు

కోలుకుంటున్న కాశ్మీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: కాశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభకు వివరించింది. హిజ్‌బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ బుర్హాన్ వనీ భద్రతాదళాల కాల్పుల్లో మరణించిన తరువాత రాష్ట్రం హింసా, విధ్వంసకాండలతో అట్టుడికిన నేపథ్యంలో సుప్రీం కోర్టుకు తాజా స్థితిగతుల నివేదికను సమర్పించింది. ముఖ్యంగా హింసాత్మక సంఘటనలు, ర్యాలీలు దాదాపుగా తగ్గిపోయాయని ఈ నివేదికలో కేంద్రం వివరించింది. ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు ఎఎం ఖాన్ విల్కర్, డివై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనానికి ఈ నివేదికను అందించింది. పరిస్థితి మెరుగైనందున కాశ్మీర్ లోయలోని చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేశాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తెలిపారు. అలాగే భద్రతాదళాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు నిరంతరం తీసుకుంటున్న చర్యల వల్లే పరిస్థితుల్లో గుణాత్మకమైన మార్పు కనిపించిందని, ఘర్షణలను, నిరసనలు తగ్గిపోయాయని వివరించారు.