జాతీయ వార్తలు

ఎన్టీపిసి ప్లాంట్‌కు భూమి కేటాయంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: నేషనల్ ధర్మల్ పవర్ ప్లాంట్ మహబూబ్‌నగర్ జిల్లాలోని గట్టులో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంటుకు భూమి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించాలని కాంగ్రెస్ నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. నంది ఎల్లయ్య మంగళవారం ఈ మేరకు మోదీ, గోయల్‌కు లేఖ రాశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గట్టులో సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి లభిస్తుందని ఎల్లయ్య పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్ నియోజకవర్గం ఎంతో వెనకుబడి ఉన్నదని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి ప్రాజెక్టులను ప్రారంభించవలసిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు. గట్టులో వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేయాలని ఎన్‌టిపిసి ప్రతిపాదించింది. సంస్థ అధికారులు ఇటీవల ఈ ప్రాంతానికి వచ్చి భూమిని పరిశీలించారని ఎల్లయ్య తెలిపారు. సోలార్ పవర్ ప్లాంటుకు భూమిని కేటాయించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి తాను ఇటీవల లేఖ రాసినట్లు ఆయన వివరించారు. ఎన్‌టిపిసి అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను కలిసి సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేయటం గురించి చర్చించారు, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంత వరకు భూమిని కేటాయించలేదని ఎల్లయ్య ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేశారు. వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన సోలార్ పవర్ ప్లాంటుకు భూమిని కేటాయింపజేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడాలని ఆయన నరేంద్ర మోదీని కోరారు.