క్రీడాభూమి

యూరో 2016 ప్రీ-క్వార్టర్స్‌కు వేల్స్, ఇంగ్లండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టౌలౌస్, జూన్ 21: ఫ్రాన్స్‌లో జరుగుతున్న యూరో 2016 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో గ్రూప్-బినుంచి వేల్స్, ఇంగ్లండ్‌లు ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో వేల్స్ 3-0 గోల్స్ తేడాతో రష్యాపై ఘన విజయం సాధించి ఆ గ్రూపులో అగ్రస్థానంలో నిలవగా, స్లోవేకియాతో ఆడిన మ్యాచ్‌ను డ్రాగా ముగించి ఆ గ్రూపులో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ జట్టు ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. రష్యాతో జరిగిన మ్యాచ్‌లో వేల్స్ తరఫున రామ్‌సే 11వ నిమిషంలో అద్భుతమైన గోల్ సాధించి తన జట్టుకు ఆధిక్యత సాధించి పెట్టాడు. 20వ నిమిషంలో టేలర్ మరో గోల్ చేసి ఆ ఆధిక్యతను 2-0కు పెంచాడు. కాగా, ద్వితీయార్ధం మధ్యలో బాలే చేసిన అద్భుత గోల్‌తో వేల్స్‌కు 3-0 తేడాతో తిరుగులేని ఆధిక్యత లభించింది. కాగా, ఈ టోర్నమెంట్‌లో ఆడిన మూడు గ్రూపుమ్యాచ్‌లలో మూడు గోల్స్ చేసిన తొలి క్రీడాకారుడిగా బాలే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు 2004లో జరిగిన యూరోపియన్ చాంపియన్‌షిప్స్‌లో నెదర్లాండ్స్ తరఫున మిలన్ బారోస్, రూడ్ వాన్ నెస్టెల్‌రాయ్‌లు సైతం ఇలాగే మూడు గ్రూపుమ్యాచ్‌లలోను మూడు గోల్స్ చేశారు. కాగా, ఇంతకు ముందు ఇంగ్లండ్-రష్యాల మధ్య జరిగిన గ్రూపు మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల అభిమానుల మధ్య గొడవలు జరిగిన నేపథ్యంలో టౌలౌసే స్టేడియంలో దాదాపు 2వేల మంది పోలీసులను భద్రత కోసం నియమించారు. ఇంతకు ముందు జరిగిన సంఘటన ఫలితమో లేక మరే కారణమో తెలియదు కానీ, ఈ మ్యాచ్‌లో ఎక్కడ కూడా రష్యా ఆదిక్యతను ప్రదర్శించలేక పోయింది.
కాగా, సెయింట్ ఎటిన్నీలో ఇంగ్లండ్-స్లోవేకియాల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఇంగ్లండ్ ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే గ్రూపులో టాప్‌లో నిలవాలన్న ఆ జట్టు ఆశలను స్లోవేకియా విజయవంతంగా అడ్డుకుంది. మ్యాచ్ ప్రారంభంనుంచి ఇంగ్లండ్ ఆటగాళ్లు గోలుకోసం ప్రత్యర్థి గోలుపై దాడి జరిపినప్పటికీ స్లోవేకియా ఆటగాళ్లు ముఖ్యంగా గోల్‌కీపర్ మాటస్ కొజాసిక్ విజయవంతంగా ఆ ప్రయత్నాలను అడ్డుకోగలిగారు. దీంతో ఇంగ్లండ్ నిరాశకు గురయింది. ఇక ఇంగ్లండ్ వచ్చే సోమవారం నైస్‌లోగ్రూప్ -ఎఫ్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టును ఢీకొంటుంది. హంగరి, పోర్చగల్‌లలో ఒక దానితో అది తలపడుతుంది.

చిత్రం వేల్స్‌ను గెలిపించిన గారెత్ బాలే