క్రీడాభూమి

ధోనీ@ 350

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే: జింబాబ్వేతో బుధవారం జరిగిన మూడో వనే్డలో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక అరుదైన మైలురాయిని చేరాడు. వనే్డల్లో అత్యధిక డిస్మిసల్స్ సాధించిన వికెట్‌కీపర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని సంపాదించాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 482 డిస్మిసల్స్‌తో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, ఆడం గిల్‌క్రిస్ట్ 472, మార్క్ బౌచర్ 424 వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. నాలుగో స్థానంలో ఉన్న ధోనీ 278 వనే్డల్లో 261 క్యాచ్‌లు పట్టగా, 89 స్టంపింగ్స్ చేశాడు. వనే్డల్లో 300 లేదా అంతకు మించిన డిస్మిసల్స్‌ను సాధించిన తొలి భారత కీపర్‌గా అతను ఇది వరకే రికార్డు సృష్టించాడు. 300 డిస్మిసల్స్ మైలురాయిని అతను 2014 జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేరుకున్నాడు.
అప్పుడైనా నా కూతురు గుర్తుపడుతుందేమో..
మైదానంలో ఎప్పుడు నింపాదిగా కనిపించే ‘మిస్టర్ కూల్’ ధోనీలో సరదా మాట్లా డడంలోనూ నేర్పరే. బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకుండా ఉండే అతనికి జింబాబ్వే టూర్ ముగియడంతో అక్టోబర్ వరకు విరామం లభించనుంది. న్యూజిలాండ్‌తో వనే్డ సిరీస్ వరకు అతను ఖాళీగానే ఉంటాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం మాట్లాడుతున్న ఫ్పుడు హఠాత్తుగా ఇంటి ప్రస్తావన తెచ్చాడు. తరచు టోర్నీలు, సిరీస్‌లలో బిజీగా ఉం టూ ఇంటికి దూరమయ్యానని, తన కూతురు జీవా తనను గుర్తుపడుతుందో లేదోనని వ్యాఖ్యానించాడు. అక్టోబర్ వరకు విరామం దొరకబోతున్నదని, అప్పుడైనా కుటుంబం తో గడిపితేనన్నా ఆమె గుర్తుపడుతుందేమోనని చమత్కరించాడు. మ్యాచ్ గురించి మాట్లాడుతూ ఈ విజయం సంతృప్తినిచ్చిందని అన్నాడు.