క్రీడాభూమి

శిక్షణా శిబిరానికి హాజరవుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 19: ఒలింపిక్స్ కోసం వచ్చే వారం ప్రారంభమయ్యే శిక్షణా శిబిరానికి హాజరవుతామని భారత మహిళా హాకీ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ కారణంగా పలు అన్ని రకాల క్రీడా ఈవెంట్స్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలు కూడా ఎలాంటి కార్యక్రమాలను చేపట్టడం లేదు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత మహిళా హాకీ జట్టు ప్రాబబుల్స్‌కు శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నట్టు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఇది వరకే ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ శిబిరం ఉండదన్న అనుమానాలు తలెత్తాయ. అయతే, శిబిరం యథాతథంగా జరుగుతుందని, తామంతా హాజరవుతామని నవ్‌నీత్ కౌర్ ప్రకటించింది. ఒలింపిక్స్‌లో పూల్ ‘ఏ’ నుంచి పోటీపడనున్న భారత జట్టు తొలి మ్యాచ్‌లో బలమైన నెదర్లాండ్స్‌ను ఢీ కొంటుంది. ఈ గ్రూపులో భారత్, నెదర్లాండ్స్‌తోపాటు జర్మనీ, గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఉన్నాయ.బలమైన జట్లు బరిలో ఉన్నందువల్ల గట్టిపోటీ తప్పదని కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ అభిప్రాయపడింది. కీలకమైన మ్యాచ్‌లను నెగ్గడం, అవసరానికి తగిన రీతిలో వ్యూహాలను అమలు చేయడం తమ లక్ష్యమని పేర్కొంది. చీఫ్ కోచ్ జొయెర్డ్ మరినే మార్గదర్శకంలో అన్ని విభాగాల్లోనూ నైపుణ్యాన్ని మెరుగు పరచుకోవడానికి శిక్షణా శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని నవ్‌నీత్ కౌర్ తెలిపింది. అన్ని విధాలా ఒలింపిక్స్‌కు సిద్ధమవుతామని, ఎలాంటి జట్టు ఎదురైనప్పటికీ ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఆడతామని పేర్కొంది. చివరి క్షణం వరకూ పోరాటాన్ని ఆపకూడదన్నదే తమ ప్రధాన వ్యూహమని పేర్కొంది. మ్యాచ్ పూర్తయనట్టు చివరి విజిల్ మోగే వరకూ, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని, కాబట్టి విజయం కోసం చివరి వరకూ పోరాటం సాగించాలని కోచ్ తమకు ఎప్పుడూ చెప్తుంటాడని నవ్‌నీత్ కౌర్ చెప్పింది. ఆయన మాటలు, సూచనలు తమకు మార్గదర్శకాలని వ్యాఖ్యానించింది.