క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్: కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన వివిధ టోర్నీలు, సిరీస్‌ల జాబితాలో ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ కూడా చేరింది. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని, ముందుజాగ్రత్త చర్యగా ఈ టోర్నమెంట్‌ను వాయిదా వేస్తున్నట్టు ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ (ఎఫ్‌ఎఫ్‌టీ) అధ్యక్షుడు బెర్నార్డ్ గిడియసెల్లీ ప్రకటించాడు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ను అనుసరించి మే 24వ తేదీన ఫ్రెంచ్ ఓపెన్ మొదలు కావాల్సి ఉంది. అయితే, దీనిని సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా వేసినట్టు గిడియసెల్లీ తెలిపాడు. అక్టోబర్ 4వ తేదీతో ఈ టోర్నీని ముగిస్తామని ఆయన పేర్కొన్నాడు. ‘ఇది చాలా సంక్లిష్టమైన నిర్ణయం. మేము ఎన్నో సమస్యలను, ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. యూఎస్ ఓపెన్ ముగిసిన కేవలం వారం రోజుల్లోనే ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. ఇది ఒకరకంగా ఆటగాళ్లకు కూడా కష్టతరమైన అంశమే. అయితే, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ఈ వాయిదా తప్పలేదు’ అని చెప్పాడు. యూఎస్ ఓపెన్ కూడా వాయిదా పడే అవకాశాలు లేకపోలేదని ఆయన వ్యాఖ్యానించాడు. కాగా, పురుషుల విభాగంలో ఏటీపీ టూర్, మహిళ విభాగంలో డబ్ల్యూటీఏ టూర్ మ్యాచ్‌లు, సిరీస్‌లు రద్దయ్యాయి. ఈ రెండు టెన్నిస్ క్రీడా సంస్థలు తదుపరి నిర్ణయం ప్రకటించేవరకు టూర్ సిరీస్‌లేవీ ఉండవని తేల్చిచెప్పాయి. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ షెడ్యూల్‌ను ఖరారు చేయడం అంతర్జాతీయ టెన్నిస్ అధికారులకు కష్టసాధ్యంగా మారనున్నది.