క్రీడాభూమి

అలిసా, బెత్ అర్ధ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్‌బెరా, ఫిబ్రవరి 27: ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడింది. మహిళల టీ-20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు ఎలిసా హీలీ, బెత్ మూనీ అద్భుత ప్రతిభ కనబరచి, అర్ధ శతకాలు నమోదు చేయడంతో, 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి 189 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆతర్వాత బంగ్లాదేశ్‌ను 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులకే పరిమితం చేసి, 86 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఎలిసా హీలీ 53 బంతుల్లో, 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 83 పరుగులు సాధించి, కెప్టెన్ సల్మా ఖటూన్ బౌలింగ్‌లో సాజిదా ఇస్లాం క్యాచ్ పట్టగా వెనుదిరిగింది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆష్లే గార్డ్‌నెర్‌తో కలిసి ఆగ్రత్తగా ఆడిన మరో ఓపెనర్ బెత్ మూడీ రెండో వికెట్ కూలకుండా జాగ్రత్త పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్ వికెట్ నష్టానికి 189 పరుగులు చేసే సమయానికి బెత్ మూనీ 81, ఆష్లే గార్డ్‌నెర్ 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. బంగ్లాదేశ్ తరఫున సల్మాన్ ఖటూన్ తప్ప ఎవరికీ వికెట్ లభించలేదు.
ఆసీస్‌ను ఓడించేందుకు 190 పరుగులు చేయాల్సి ఉండగా, 19 పరుగుల వద్ద తొలి వికెట్‌ను ముర్షిదా ఖటూన్ (8) రూపంలో కోల్పోయిన బంగ్లాదేశ్ ఆతర్వాత కోలుకోలేదు. మిడిల్ ఆర్డర్‌లో ఫర్గానా హక్ (36) ఎంతగా పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆమెతోపాటు షమీమా సుల్తానా (13), నిగర్ సుల్తానా (19), రుమానా అహ్మద్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా వారు సింగిల్ డిజిట్స్‌కే పరిమితం కావడంతో, బంగ్లాదేశ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 103 పరుగులకు పరిమితమై, భారీ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షట్ కేవలం 21 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టింది. జెస్ జొనాసెన్ 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసింది. ఆస్ట్రేలియా విజయంలో బౌలర్లు కూడా తమ వంతు పాత్ర పోషించారు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా మహిళలు: 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 189 (అలిసా హీలీ 83, బెత్ మూనీ 81 నాటౌట్, ఆష్లే గార్డ్‌నర్ 22 నాటౌట్, సల్మా ఖటూన్ 1/39).
బంగ్లాదేశ్ మహిళలు: 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 (్ఫర్గానా హక్ 36, నిగర్ సుల్తానా 19, మెగాన్ షట్ 3/21, జెస్ జొనాసెన్ 2/17).
*చిత్రం... ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసిన అలిసా హీలీ (83), బెత్ మూనీ (81)