క్రీడాభూమి
మెక్సికన్ ఓపెన్‌లో నాదల్ ముందంజ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 27 February 2020

అకాపల్కొ, ఫిబ్రవరి 27: మెక్సికన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్ ముందంజ వేశాడు. రెండో రౌండ్లో అతను సెర్బియా ఆటగాడు మియోమిర్ కెచ్మానొవిచ్ను అతను 6-2, 7-5 తేడాతో ఓడించాడు. మొదటి సెట్‌ను సునాయాసంగానే గెల్చుకున్న నాదల్కు రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. దీనిని సమర్థంగా తిప్పికొట్టిన నాదల్ ఆ సెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో జాన్ ఇస్నర్ 6-3, 7-6 ఆధిక్యంతో మార్కొస్ గిరోన్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లోనూ మొదటి సెట్ ఏకపక్షంగానూ, రెండో సెట్ ఉత్కంఠ భరితంగానూ కొనసాగి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయ.
*చిత్రం... ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్