క్రీడాభూమి

దక్షిణాఫ్రికా ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, ఫిబ్రవరి 27: దక్షిణాఫ్రికాతో జరిగిన అత్యంత కీలకమైన చివరి, మూడో మ్యాచ్‌ని గెల్చుకున్న ఆస్ట్రేలియా టీ-20 సిరీస్‌ను 2-1 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో చెరొక విజయాన్ని నమోదు చేయడంతో, చివరిదైన మూడో టీ-20 ప్రధాన్యతను సంతరించుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ అర్ధ శతకాలతో రాణించడంతో, నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్లకు 193 పరుగులు సాధించింది. వార్నర్ 57 పరుగులు చేయగా, కెప్టెన్ ఫించ్ 55 పరుగులు సాధించాడు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 30 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో ఆసీస్‌కు గౌరవ ప్రదమైన స్కోరు సాధ్యమైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 15.3 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ రసీ వాన్ డెర్ దూసన్ 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, హెన్రిక్ క్లాసెన్ 22 పరుగులు చేశాడు. మిగతా వారు దారుణంగా విఫలం కావడంతో, సౌతాఫ్రికాకు ఓటపి తప్పలేదు. ఆసీస్ స్పిన్నర్ అష్టన్ అగర్ కేవలం 16 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు పేసర్ మిచెల్ స్టార్క్ 23 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఆడం జంపా 10 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. మిచెల్ మార్క్, పాట్ కమిన్స్‌కు చెరొక వికెట్‌ల లభించింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 (డేవిడ్ వార్నర్ 57, ఆరోన్ ఫించ్ 55, మిచెల్ మార్ష్ 19, స్టీవ్ స్మిత్ 30 నాటౌట్, కాగిసో రబదా 1/42, ఎన్‌రిచ్ నోజే 1/46, ఎన్గిడీ 1/33, ప్రిటోరియస్ 1/42, తబ్రాజ్ షంషి 1/25).
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 15.3 ఓవర్లలో 96 ఆలౌట్ 9రాసీ వాన్ డెర్ డూసన్ 24, హెన్రిక్ క్లాసెన్ 22, డేవిడ్ మిల్లర్ 15, మిచెల్ స్టార్క్ 3/23, ఆష్టన్ అగర్ 3/16, ఆడం జంపా 2/10).