క్రీడాభూమి

అంతర్జాతీయ కెరీర్‌కు షరపోవా గుడ్ బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్: టెన్సిస్ బ్యూటీగా పేరు సంపాదించిన రష్యా స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవా తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. ‘టెన్సిస్.. నేను గుడ్ బై చెబుతున్నాను’. అంటూ ఓగ్ అండ్ వ్యానిటీ ఫెయిర్ మ్యాగ్జిన్ ద్వారా 32 ఏళ్ల షరపోవా రిటైర్మెంట్‌ను ప్రకటించింది. ఆరు అడుగుల రెండు అంగుళాల పొడవుతో, అందర్నీ ఆకర్షించే రూపంతో షరపోవా ఆట కంటే తన అందంతోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు 2016లో ప్రకటించి సంచలనం సృష్టించింది.
సస్పెన్షన్‌కు గురైనప్పటికీ శిక్షా కాలం పూర్తయిన తర్వాత మళ్లీ కెరీర్‌ను కొనసాగించింది. అయితే, అంతకుముందు మాదిరిగా విజయాలను నమోదు చేయలేకపోయింది. కెరీర్‌లో ఆమె ఐదు గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిళ్లను కైవశం చేసుకుంది. 2004లో వింబుల్డన్, 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లను సాధించిన షరపోవా 2012, 2014 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్ కిరీటాన్ని దక్కించుకుంది. మొత్తమీద ఆమె 816 మ్యాచ్‌లు ఆడి, 645 విజయాలను సాధించింది. 171 మ్యాచ్‌లలో పరాజయాన్ని ఎదుర్కొంది. 5 గ్రాండ్ శ్లామ్‌లతోపాటు 36 డబ్ల్యూటీఏ, 4 ఐటీఎఫ్ టైటిళ్లను కూడా ఆమె సంపాదించుకుంది. 3,87,03,609 డాలర్ల ప్రైజ్ మనీని సంపాదించింది. ఆల్‌టైమ్ ర్యాంకింగ్స్‌లో అత్యధికంగా సంపాదించిన మూడో క్రీడాకారిణిగా గుర్తింపు సంపాదించింది. 1987 ఏప్రిల్ 19న జన్మించిన షరపోవా 14 సంవత్సరాల వయసులోనే ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా మారింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు తన కెరీర్‌కు ముగింపు పలికింది.
*చిత్రం...మీడియా సమక్షంలో రిటైర్మెంట్ ప్రకటిస్తున్న షరపోవా