క్రీడాభూమి
హీదర్ నైట్ సెంచరీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్బెర్రా, ఫిబ్రవరి 26: మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం నాడిక్కడ థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మహిళా జట్టు 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ అమీ ఎలెన్ జోన్స్ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరగ్గా, ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ డానియెల్లీ వ్యాట్ (0) కూడా డకౌట్‌గా వెనుదిరిగింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన నటాలీ స్కీవర్, కెప్టెన్ హీదర్ నైట్లు ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరు బాధ్యతను భుజాన వేసుకున్నారు. వీరిద్దరూ క్రీజులో కుదురుకున్నాక చెలరేగి ఆడారు. వరుస బౌండరీలు, సిక్సర్లతో మైదానమంతా హోరెత్తించారు. ఈ క్రమంలో 38 బంతుల్లోనే కెప్టెన్ హీదర్ నైట్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, కొద్దిసేపటికే 45 బంతుల్లోనే స్కీవర్ కూడా అర్ధ సెంచరీని సాధించింది. ఆ తర్వాత వీరిద్దరూ ఆటలో మరింత వేగం పెంచారు. ముఖ్యంగా హీదర్ నైట్ సిక్సర్లతో అలరించింది. ఈ క్రమంలోనే మరో 28 బంతుల్లోనే తన కెరీర్లో తొలి టీ20 సెంచరీ సాధించింది. దీంతో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన క్రీడాకారిణిగా హీదర్ నైట్ గుర్తింపు పొందింది. మరోవైపు చివరి వరకు క్రీజులో నిలిచిన ఈ జంట 169 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. నటాలీ స్కీవర్ (59), హీదర్ నైట్ (108) పరుగులు సాధించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయ 176 పరుగులు చేసింది. థాయ్ బౌలర్లలో నట్టాయ భూచతమ్, సొరయ లటే ఒక్కో వికెట్‌ను పడగొట్టారు.
ఆ తర్వత లక్ష్య ఛేదనకు దిగిన థాయ్‌లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 78 పరుగులు మాత్రమే చేసి 98 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. థాయ్‌లాండ్ జట్టులో నట్టాకన్ చంతమ్ (32), నరుమోల్ చాయ్‌వై (19), నన్నాపట్ కొంచరొంకై (12) మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. ఇంగ్లీష్ బౌలర్లలో అన్య శ్రుభ్‌సోల్ 3 వికెట్లు పడగొట్టగా, నటాలీ స్కీవర్ 2, సోఫీ ఎక్లెస్టోన్ 1 వికెట్ పడగొట్టారు.
వెస్టిండీస్‌పై పాక్..
మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్‌కు దిగి, నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 124 పరుగులు చేసింది. కెప్టెన్ స్ట్ఫానీ టైలర్ (43), వికెట్ కీపర్ షిమైన్ క్యాంప్‌బెల్ (43)లు రాణించారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన పాక్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు కోల్పోయ విజయం సాధించింది. ఓపెనర్ జావేరియా ఖాన్ (35), మునీబా అలీ (25), కెప్టెన్ బిస్మా మరూఫ్ (39, నాటౌట్)లు రాణించారు.
*చిత్రాలు.. హీదర్ నైట్ (108, నాటౌట్)
*పాక్ విజయానందం