క్రీడాభూమి

ఎర్విన్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, ఫిబ్రవరి 22: కెప్టెన్ క్రెగ్ ఎర్విన్ సెంచరీతో రాణించడంతో, బంగ్లాదేశ్‌తో శనివారం ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే తన తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 228 పరుగులు చేసింది. కేవలం ఏడు పరుగులకే తొలి వికెట్‌ను కెవిన్ కసుజా (2) రూపంలో చేజార్చుకున్న జింబాబ్వేకు ఓపెనర్ ప్రిన్స్ ఏ మాస్వార్‌తో కలిసి కెప్టెన్ ఎర్విన్ అండగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 111 పరుగులు జోడించడం విశేషం. 64 పరుగులు చేసిన ప్రిన్స్‌ను నరుూమ్ హసన్ రిటర్న్ క్యాచ్ పట్టుకొని పెవిలియన్‌కు పంపాడు. సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్ (10), సికందర్ రజా (18), టిమిసెన్ మరుమా (9) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా, 227 బంతులు ఎదుర్కొని, 13 ఫోర్లతో 107 పరుగులు చేసిన ఎర్విన్‌ను నరుూమ్ హసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రెగిస్ చకాబ్వా (7 నాటౌట్), డొనాల్డ్ తిరిపానో (0 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. నరుూమ్ హసన్ 68 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. అబూ జయేద్‌కు 2 వికెట్లు లభించాయి.
సంక్షిప్త స్కోర్లు
జింబాబ్వే తొలి ఇన్నింగ్స్: 90 ఓవర్లలో 6 వికెట్లకు 228 (ప్రిన్స్ ఏ మస్వార్ 64, క్రెగ్ ఎర్విన్ 107, నరుూమ్ 68/4, అబూ జయేద్ 2/51).