క్రీడాభూమి

హోప్ సెంచరీ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: ఓపెనర్, వికెట్‌కీపర్ షాయ్ హోప్ అద్భుత సెంచరీ వెస్టిండీస్‌ను ఆదుకోలేకపోయింది. ఓపెనర్లు రాణించడంతో, తొలి వనే్డలో శ్రీలంక తన లక్ష్యాన్ని తొమ్మిది వికెట్ల నష్టంతో చేరుకొని, ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 289 పరుగులు సాధించింది. హోప్ 140 బంతులు ఎదుర్కొని, పది ఫోర్లంతో 115 పరుగులు చేశాడు. డారెన్ బ్రేవో 39, రాస్టన్ ఛేజ్ 41, చివరిలో కిమో పాల్ 32 (నాటౌట్), హేడెన్ వాల్ష్ 20 (నాటౌట్) విండీస్‌కు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. లంక బౌలర్లలో ఇసురు ఉదానా 82 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. నువాన్ ప్రదీప్, తిసర పెరెరా ఒక్కో వికెట్ కూల్చ గా, ఇద్దరు విండీస్ బ్యాట్స్‌మెన్ రనౌటయ్యారు.
అనంతరం లక్ష్య ఛేదనకు నడుం బిగించిన లంకకు ఓపెనర్లు అర్ధ శతకాలతో రాణించి, విజయానికి పునాది వేశారు. అవిష్క ఫెర్నాండో 50, కెప్టెన్ దిముత్ కరుణరత్నే 52 పరుగులు చేయగా, కుశాల్ పెరెరా 42 పరుగులు సాధించారు. ఆతర్వాత వరుసగా వికెట్లు కూలడంతో లంక విజయం అనుమానంగా మారింది. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో తిసర పెరెరా (32), వినిందు హసరంగ (42 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. తొమ్మిది వికెట్లు కూలినప్పటికీ హసరంగ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా జట్టును గెలిపించాడు. లంక 49.1 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 290 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అల్జామీ జోసెఫ్ మూడు వికెట్లు పడగొట్టాడు. కీమో పాల్, హేడెన్ వాల్ష్ చెరి రెండు కూల్చారు.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 7 వికెట్లకు 289 (షాయ్ హోప్ 115, డారెన్ బ్రేవో 39, రాస్టన్ ఛేజ్ 41, కీమో పాల్ 32 నాటౌట్, హేడెన్ వాల్ష్ 20 నాటౌట్, ఇసురు ఉడానా 3/82).
శ్రీలంక ఇన్నింగ్స్: 49.1 ఓవర్లలో 9 వికెట్లకు 290 (అవిష్క ఫెర్నాండో 50, దిముత్ కరుణరత్నే 52, కుశాల్ పెరెరా 42, తిసర పెరెరా 32, వనిందు హసరంగ 42 నాటౌట్, అల్జామీ జోసెఫ్ 3/42, కీమో పాల్ 2/48, హేడెన్ వాల్ష్ 2/38).