క్రీడాభూమి

దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 22: దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన మొదటి టీ-20లో ఆస్ట్రేలియా ఏకంగా 107 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఈ జట్టు 20 ఓవర్ల లో ఆరు వికెట్లకు 196 పరుగులు సాధించింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 42, మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 45 పరుగులతో రాణించారు. మాథ్యూ వేడ్ (18), మిచెల్ మార్ష్ (19), అలెక్స్ కారీ (27), ఆష్టన్ అగర్ (20 నాటౌట్) కూడా తమ వంతు పాత్ర పోషించారు. ఫలితంగా ఆసీస్ ఈ స్కోరును నమోదు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో డేల్ స్టేన్, తబ్రాజ్ షంషి చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరడంలో విఫలమైన దక్షిణాఫ్రికా 14.3 ఓవర్లలో 89 పరుగుకే ఆలౌటైంది. ఫఫ్ డు ప్లెసిస్ (24), పిటే వాన్ బిల్జాన్ (16), కాగిసో రబదా (22) తప్ప మిగతా వారంతా సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ సీనియర్ బౌలర్ అష్టన్ అగర్ 24 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బతీశారు. పాట్ కమిన్స్, ఆడం జంపా చెరి 2 వికెట్లు కూల్చారు.