క్రీడాభూమి

హైదరాబాద్ జట్టుకు 137 పరుగుల ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: రాజస్థాన్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు మొదటి రోజు 137 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 171 పరుగులకే ఆలౌటైంది. వికెట్ కీపర్ కొల్ల సుమంత్ (51) మాత్రమే అర్ధ సెంచరీతో రాణించాడు. అనికేత్ చౌదరి, రితురాజ్ సింగ్‌లు మూడేసి వికెట్లు తీసుకోగా, తన్వీర్ ఉల్ హక్, ఎస్కే శర్మ, మహిపాల్ లామ్‌రార్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్ సలో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు రవి కిరణ్, చామ మిలింద్, సాకేత్ సాయరాం దెబ్బకు 135 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 36 పరుగుల ఆధిక్యంతో వెంటనే రెండో ఇన్నిం గ్స్‌కు దిగిన హైదరాబాద్ జట్టు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లను కోల్పోయ 101 పరుగులు చేసింది. అక్షంత్ రెడ్డి (43, బ్యాటింగ్), క్రీజులో ఉన్నాడు.
ఆంధ్రాకు ఆధిక్యం..
ఒంగోలు: రంజీట్రోఫీలో భాగంగా బుధవారం నాడిక్కడ కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్రా జట్టుకు తొలిరోజు 93 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేరళ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. షోయాబ్ మహ్మద్ ఖాన్, యర్రా పృథ్వీరాజ్, కేవీ శశికాంత్ దెబ్బకు కేరళ 162 పరుగులకే కుప్పకూలింది. బసిల్ థాంపి (42) మినహా మరెవరూ చెప్పుకోదగిన స్కోరు సాధించలేదు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన ఆంధ్రా జట్టు ఆట ముగిసే సమయానికి 255 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ ప్రశాంత్ కుమార్ (79), వికెట్ కీపర్ ఉప్పర గిరినాథ్ (41), నితీష్ రెడ్డి (39) రాణించారు. దీంతో తొలిరోజు ఆంధ్రా జట్టుకు 93 పరుగుల ఆధిక్యం లభించినట్లయంది. కేరళ బౌలర్లలో బసిల్ థాంపి, కెప్టెన్ జలజ్ సక్సేనా చెరో వికెట్లు పడగొట్టగా, మహ్మద్ నిదీష్, ఎన్పీ బసిల్, అభిషేక్ మోహన్‌లు తలో వికెట్ తీసుకున్నారు.
సర్ఫరాజ్ ఖాన్ ‘డబుల్’
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్‌తో మంగళవారం నుంచి ప్రారంభమైన మ్యాచ్‌లో ముంబయ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ (226, నాటౌట్) తొలి రోజు డబుల్ సెంచరీ సాధించాడు. సర్ఫరాజ్‌తో పాటు కెప్టెన్, వికెట్ కీపర్ ఆదిత్య థారె (62) అర్ధ సెంచరీ సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబయ జట్టు 5 వికెట్లను కోల్పోయ 372 పరుగులు చేసింది. గత వారం క్రితం ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సర్ఫరాజ్ ఖాన్ ట్రిపుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.