క్రీడాభూమి
పేస్, నవ్రతిలోవాపై సానియా, భూపతి విజయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కోల్‌కతా, నవంబర్ 25: లెజెండరీ టెన్నిస్ స్టార్ మార్టినా నవ్రతిలోవా, లియాండర్ పేస్ జోడీపై సానియా మీర్జా, మహేష్ భూపతి జోడీ 7-5, 7-5 తేడాతో విజయం సాధించింది. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్)ను ప్రమోట్ చేసేందుకు ఇక్కడ జరిగిన ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మ్యాచ్ ఆరంభించేందుకు వచ్చి, కొద్దిసేపు సరదాగా టెన్నిస్ ఆడింది. ఆమెకు సానియా పాఠాలు నేర్పుతున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్‌లో టెన్నిస్ అకాడెమీని నెలకొల్పిన సానియాకు నవ్రతిలోవా అండగా ఉంది. ఇటీవల ఆమె అకాడెమీని సందర్శించి పిల్లలకు సూచనలిచ్చింది. కాగా, కోల్‌కతా నుంచి ముంబయికి మకాం మార్చిన పేస్ మళ్లీ తన స్వస్థలానికి చేరుకోవడంతో అభిమానులు అతనికి బ్రహ్మరథం పట్టారు.
ఇంగ్లాండ్‌లో భారత్, పాక్ టెస్టు సిరీస్!
కరాచీ, నవంబర్ 25: భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ వచ్చేనెల శ్రీలంకలో జరుగుతుందని, అదే విధంగా వచ్చే ఏడాది జరిగే టెస్టు సిరీస్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తుందని సమాచారం. శ్రీలంకలో భారత్‌తో వనే్డ సిరీస్‌ను ఆడేందుకు అనుమతించాల్సిందిగా ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పిసిబి అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ కోరినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గత ఏడాది పిసిబి, బిసిసిఐ మధ్య కుదిరిన ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా పాకిస్తాన్‌తో భారత్ పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడాల్సి ఉంది. అయితే, 2008లో లంక ఆటగాళ్లపై ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత పాక్‌లో జింబాబ్వే మినహా ఇప్పటి వరకూ ఏ టెస్టు జట్టు పర్యటించలేదు. దీనితో హోం సిరీస్‌లకు యుఎఇని పాక్ వేదికగా ఎంచుకుంది. అయితే, యుఎఇలో మ్యాచ్‌లు ఆడేందుకు బిసిసిఐ సుముఖత వ్యక్తం చేయలేదు. పైగా భారత్‌కే రావాల్సిందిగా ఆహ్వానించింది. దీనికి పిసిబి నిరాకరించింది. ఇటీవల దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమావేశం జరిగినప్పుడు మనోహర్, షహర్యార్ ఖాన్ శ్రీలంక, ఇంగ్లాండ్‌లో దేశాల్లో సిరీస్‌లకు లాంఛనంగా ఆమోద ముద్ర వేశారని తెలుస్తున్నది.