క్రీడాభూమి

ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 14: న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరుగుతున్న మొదటి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యం సాధించింది. మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 109/5తో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మరో 57 పరుగులు చేసి ఆలౌటైంది. స్టార్ ఆల్ రౌండర్ రాస్ టేలర్ (80) పరుగుల వద్ద లియాన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా, వికెట్ కీపర్ బీజే వాల్టింగ్ (8), కొలిన్ డీ గ్రాండ్‌హోం (23), మిచెల్ శాంతార్న్ (2), టిమ్ సౌథీ (8) దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీసుకోగా, నాథన్ లియాన్ 2, జోష్ హజెల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, మార్నస్ లబుషేన్ ఒక్కో వికెట్ తీశారు.
లబూస్ మళ్లీ..
మొదటి ఇన్నింగ్స్‌లో 250 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన కంగారూ లు నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. అయతే మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ (19) రెండో ఇన్నింగ్స్‌లోనూ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. టిమ్ సౌథీ వేసిన 18వ ఓవర్ చివరి బంతికి సబ్‌స్టిట్యూడ్ ఫీల్డర్ టామ్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్ కలిసి మరో ఓపెనర్ జో బర్న్స్ కివీ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లకు ఏమా త్రం అవకాశమివ్వకుండా పరుగులను రాబట్టారు. అయతే మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న లబుషేన్, రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగుల మార్క్‌ను చేరుకోగానే ఈ ఏడాది క్యాలెండర్ ఈయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడి గా ఘనత సాధించాడు. మరోవైపు ఈ జోడీని విడదీసేందుకు కివీ బౌలర్లను చేయని ప్రయత్నం లేదు. ఈక్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయతే అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న కొద్దిసేపటికే లబుషేన్ (50) వాగ్నార్ బౌలింగ్‌లో శాంతార్న్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరికొద్దిసేపటికే సౌథీ బౌలింగ్‌లో నికోల్క్‌కి క్యాచ్ ఇచ్చి జో బర్న్స్ (53) అవుటయ్యాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. అనంతరం స్టీవ్ స్మిత్ (16) ఆకట్టుకోలేకపోగా, ట్రావిస్ హెడ్ (5), కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్ (0) దారుణంగా విఫలమయ్యారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలి యా జట్టు 6 వికెట్లు కోల్పోయ 167 పరుగులు చేసి, 417 పరుగుల ఆధిక్యం సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 4 వికెట్లు తీసుకోగా, నెల్ వాగ్నార్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆటకు మరో రెండు రోజుల సమయం మిగిలి ఉండడంతో ఫలితం తేలే అవకాశముంది.
స్కోర్ బోర్డు..
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 416 ఆలౌట్
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్: జీత్ రావల్ (బీ) హజెల్‌వుడ్ 1, టామ్ లాథమ్ (సీ) (బీ) స్టార్క్ 0, కేన్ విలియమ్సన్ (సీ) స్టీవ్ స్మిత్ (బీ) స్టార్క్ 34, రాస్ టేలర్ (సీ) స్టీవెన్ స్మిత్ (బీ) లియాన్ 80, హెన్రీ నికోల్స్ (సీ) పైన్ (బీ) స్టార్క్ 7, నెల్ వాగ్నార్ (బీ) స్టార్క్ 0, బీజే వాట్లింగ్ (బీ) ప్యాట్ కమిన్స్ 8, కొలిన్ డీగ్రాండ్ హోం (సీ) స్టీవ్ స్మిత్ (బీ) స్టార్క్ 23, మిచెల్ శాంతార్న్ (బీ) లబూస్‌ఛేంజ్ 2, టిమ్ సౌథీ (సీ) నెసెర్ (బీ) లియాన్ 8, లాకీ ఫెర్గూసన్ (నాటౌట్) 0.
ఎక్స్‌ట్రాలు: 3 మొత్తం: 166 (55.2 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-1, 2-1, 3-77, 4-97, 5-97, 6-120, 7-147, 8-155, 9-166, 10-166
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 18-2-52-5, జోష్ హజెల్‌వుడ్ 1.2-1-0-1, ప్యాట్ కమిన్స్ 14.4-3-46-1, మాథ్యూ వేడ్ 2-0-8-0, నాథన్ లియాన్ 14.2-2-48-2, మార్నస్ లబుషేన్ 5-1-9-1.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సీ) టామ్ బ్లండెల్ (బీ) సౌథీ 19, జో బర్న్స్ (సీ) హెన్రీ నికోల్స్ (బీ) సౌథీ 53, మార్నస్ లబుషేన్ (సీ) శాంతార్న్ (బీ) వాగ్నార్ 50, స్టీవ్ స్మిత్ (సీ) జీత్ రావల్ (బీ) వాగ్నార్ 16, మాథ్యూ వేడ్ (బ్యాటింగ్) 8, ట్రావిస్ హెడ్ (సీ) డీగ్రాండ్ హోం (బీ) సౌథీ 5, టిమ్ పైన్ (బీ) సౌథీ 0, ప్యాట్ కమిన్స్ (బ్యాటింగ్) 1.
ఎక్స్‌ట్రాలు: 15 మొత్తం: 167 (57 ఓవర్లలో 6 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-44, 2-131, 3-148, 4-154, 5-160, 6-160
బౌలింగ్: టిమ్ సౌథీ 19-6-63-4, కొలిన్ డీగ్రాండ్ హోం 13-2-26-0, నెల్ వాగ్నార్ 17-2-40-2, మిచెల్ శాంతార్న్ 8-0-35-0.

*చిత్రం... మార్నస్ లబుషేన్ (50)