క్రీడాభూమి

దక్షిణాసియా గేమ్స్‌లో మరో నాలుగు పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖట్మండు, డిసెంబర్ 3: ఇక్కడ జరుగుతున్న 13వ దక్షిణాసియా గేమ్స్‌లో మంగళవారం భారత్ మరో నాలుగు పతకాలను కైవసం చేసుకుంది. పురుషుల 1,500 మీటర్ల విభాగంలో స్వర్ణం, రజతంతోపాటు మహిళల 1,500 ఈవెంట్‌లో రజతం, కాంస్య పతకాలను గెల్చుకుంది. పురుషుల విభాగంలో అజయ్ కుమార్ సరో స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. అతను లక్ష్యాన్ని 3 నిమిషాల 54.18 సెకన్లలో చేరాడు. 3 నిమిషాల, 57.18 సెకన్లలో గమ్యాన్ని చేరిన అజిత్ కుమార్‌కు రజత పతకం లభించింది. నేపాల్‌కు చెందిన టన్కా కాక్రి (3 నిమిషాల, 50.20 సెకన్లు)కి కాంస్య పతకం లభించింది. మహిళల 1,500 మీటర్ల ఈవెంట్‌లో చందన (4 నిమిషాల, 34.51 సెకన్లు) రజత పతకాన్ని గెల్చుకోగా, చిత్రా పలాకీజ్ (4 నిమిషాల, 35.46 సెకన్లు)కు కాంస్య పతకం లభించింది. ఈ విభాగంలో శ్రీలంక అథ్లెట్ ఉడా కుబరలగే (4 నిమిషాల, 34.34 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధించింది.