క్రీడాభూమి

అఫ్గాన్‌కు స్వల్ప ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 28: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టుకు స్వల్ప ఆధిక్యం లభించింది. గురువారం రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ 68/2తో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 277 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ , నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శామ్రా బ్రూక్స్ అఫ్గాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అందివచ్చిన బంతుల్ని బౌండరీలకు పంపుతూ స్కోరు బోర్డును పెంచే బాధ్యతను తీసుకున్నారు. ఈ క్రమంలో జట్టు స్కోరు 116 పరుగుల వద్ద క్యాంప్‌బెల్ (55) అమీర్ హంజా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శిమ్రాన్ హెట్మాయర్ (13), రోస్టన్ ఛేజ్ (2) ఎక్కువ క్రీజులో నిలదొక్కుకోలేకపో యారు. దీంతో వెస్టిండీస్ 150 పరుగులకే 5 టాప్ ఆర్డర్‌ను కోల్పోయంది. ఓవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు బ్రూక్స్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీని సాధించాడు. మరోవైపు వికెట్ కీపర్ షేన్ డారిచ్ కూడా అఫ్గాన్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా నిలిచాడు. అర్ధసెంచరీ అనంతరం బ్రూక్స్ మరింత రెచ్చిపోయాడు. ఈ దశలో డారిచ్ (42) జహీర్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ జాసన్ హోల్డర్ (11), రఖీం కార్న్‌వాల్ ( (5) వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. మరోవైపు బ్రూక్స్ సెంచరీ కెరీర్‌లో మొదటి సెంచరీని సాధించాడు. కీమర్ రోచ్ (3) అవుటైన కొద్దిసేపటికే శామ్రా బ్రూక్స్ (111) కూడా అమీర్ హమ్జా బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ 277 వద్ద ముగిసింది. జోమెల్ వారికన్ (4) నాటౌట్‌గా నిలిచాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో అమీర్ హమ్జా 5 వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ రషీద్ ఖాన్ 3, జహీర్ ఖాన్‌కు 2 వికెట్లు దక్కాయి.
మళ్లీ తడబాటు..
మొదటి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే ఆలౌటైన అఫ్గానిస్తాన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. మొదటి వికెట్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించినా మిగతా బ్యాట్స్‌మెన్లు దానిని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఇబ్రహీం జర్దాన్, జావేద్ అహ్మదీ చక్కని ఆటతీరును ప్రదర్శించారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 53 పరుగులను జోడించారు. అయతే ఇబ్రహీం జర్దాన్ (23) కార్న్‌వాల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిగాడు. ఆ తర్వాత వచ్చిన ఇసానుల్లా జనత్ (1), రహ్మత్ షా (0), అస్గార్ అఫ్గాన్ (0), నసీర్ జమాల్ (15), అమీర్ హమ్జా (1) దారుణంగా విఫలమయ్యారు. అయతే మరో ఓపెనర్ జావేద్ అహ్మదీ (62) అర్ధ సెంచరీ సాధించి 7వ వికెట్‌గా అవుట్ కావడంతో కావడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్తాన్ 7 వికెట్లు కోల్పోయ 109 పరుగులు చేసి, 19 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అఫ్సర్ జజై (2) క్రీజులో ఉన్నాడు. వెస్టిండీస్ బౌలర్లలో కార్న్‌వాల్, రోస్టన్ ఛేజ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
కార్న్‌వాల్ రికార్డు..
అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్ రఖీం కార్న్‌వాల్ అరుదైన ఘనత అందుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన కార్న్‌వాల్, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఒక మ్యాచ్‌లో భారత పిచ్‌లపై 10 వికెట్లు తీసిన విండీస్ బౌలర్‌గా ఈ ఘనత అందుకున్నాడు.
*చిత్రాలు.. శామ్రా బ్రూక్స్ (111)

*కార్న్‌వాల్ 14-3-41-3
*రోస్టన్ ఛేజ్ 3-1-10-3