క్రీడాభూమి

భారత క్రికెటర్లపై బీపీఎల్ ఆశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, నవంబర్ 17: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతోపాటు, విదేశీ ఆటగాళ్లకు చెల్లింపులు సక్రమంగా జరపలేకపోయిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) సరికొత్త రూపాన్ని సంతరించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నది. 2011లో మొదలైన ఈ టోర్నీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. టోర్నీని తన ఆధీనంలోకి తీసుకొని ‘బంగబంధు బీపీఎల్’గా పిలవాలని నిర్ణయించింది. ఎక్కువ మంది అభిమానులను ఆకట్టుకోవడానికి వీలుగా భారత ఆటగాళ్లతో కాంట్రాక్టు కుదుర్చుకోవాలని ఆశిస్తున్నది. భారత క్రికెటర్లకు బంగ్లాదేశ్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నందున, టోర్నమెంట్ బతికి బట్టకట్టాలంటే వారితో కాంట్రాక్టు తప్పదని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ అంగీకరించాడు. ఆదివారం అతను పీటీఐతో మాట్లాడుతూ, భారత క్రికెటర్లు వస్తే, బీపీఎల్ కొత్త రూపాన్ని సంతరించుకుంటుందని వ్యాఖ్యానించాడు. అయితే, విదేశాల్లో జరిగే టీ-20 టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అనుమతిస్తుందా? లేదా? అన్నదే ప్రశ్న అని వ్యాఖ్యానించాడు. అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైరైన తర్వాత కెనడాసహా కొన్ని దేశాల్లో యువరాజ్ సింగ్ టీ-20 టోర్నీలు ఆడిన విషయాన్ని నజ్ముల్ హసన్ గుర్తుచేశాడు. ఇలావుంటే, వచ్చేనెల 11 నుంచి ప్రారంభమయ్యే బీపీఎల్‌లో వేలానికి 439 మంది విదేశీ క్రీడాకారులు ఉన్నారు. ఈ జాబితాలో భారత క్రికెటర్లు మాన్వీందర్ బిస్లా, మన్‌ప్రీత్ గోనీ, కుమార్ బొరెసాకు చోటు దక్కింది. పేరొందిన ఆటగాళ్లను తీసుకోవడం ద్వారా టోర్నీకి మరింత ప్రచారాన్ని తీసుకురావాలని బీసీబీ యోచిస్తున్నది. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా అన్నది అనుమానమే.